సాక్రిఫైస్ స్టార్‌ సునిశిత్‌పై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు..

By అంజి  Published on  17 March 2020 11:13 AM GMT
సాక్రిఫైస్ స్టార్‌ సునిశిత్‌పై లావణ్య త్రిపాఠి ఫిర్యాదు..

హైదరాబాద్‌: ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో పెద్ద జోకర్‌ మారిన దర్శకుడు, హీరో, సింగర్‌, డ్యాన్సర్‌గా చెప్పుకుంటున్న శ్రీరామోజ్‌ సునిశిత్‌పై హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పోలీసులుకు ఫిర్యాదు చేసింది. తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని తన పర్సనల్‌ అసిస్టెంట్‌ ద్వారా ఫిర్యాదు చేసింది. సునిషిత్‌ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని హీరోయిన్‌ లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హీరోగా చెప్పుకుంటున్న సునిశిత్‌ను ఇంటర్వ్యూ చేసిన యూట్యూబ్‌ ఛాన్సల్‌పై కూడా కేసులు నమోదు అయ్యినట్లు తెలిసింది. లావణ్య త్రిపాఠితో పాటు చాలా మంది హీరోయిన్స్‌తో తనకు ఎఫైర్‌ ఉందని సునిశిత్‌ చెప్పుకుంటున్నాడు. కాగా ఇంటర్వ్యూ చేసిన అన్ని ఆన్‌లైన్‌ ఛానల్సన్‌ పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు.

హీరోగా చెప్పుకునే సునిశిత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. తనకు హీరోయిన్‌ లావణ్య త్రిపాఠికి 2015లోనే సీక్రెట్‌ లవ్‌ మ్యారేజ్‌ జరిగిదంటూ, తమ ఇంటి దగ్గర ఉన్న గుడిలో పెళ్లి చేసుకున్నానని ఇష్టానుసారంగా మాట్లాడాడు. అయితే అప్పట్లో తమ ఫొటోలు, వీడియోలు ఏవీ కూడా బయటకు రాలేదని, ఒక ఛానల్‌ మాత్రం తమ పెళ్లి ఫొటోలను టెలికాస్ట్‌ చేసింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు లావణ్యకు తనకు గొడవ జరిగిందని, అందుకే ఫొటోలు అన్ని డిలీట్‌ చేశానన్నాడు. చిన్న చిన్న గొడవల కారణంగా లావణ్య, తాను విడిపోయామని చెప్పాడు.

అయితే ఈ ఉత్తిత్తి హీరో సునిశిత్‌.. గతంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబుకు లైఫ్‌ ఇచ్చానని, ఇక నాన్నకు ప్రేమతో సినిమాలో మొదటగా హీరోగా తననే తీసుకున్నారని.. అయితే షూటింగ్‌ సమయంలో తనను తప్పించి ఎన్టీఆర్‌ పెట్టుకున్నారని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అంతటితో ఆగని హీరోగా చెప్పుకుంటున్న సునిశిత్‌.. తెలుగు యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజ్‌కు లావణ్య త్రిపాఠితో ఎఫైర్‌ ఉందని, కావాలంటే లావణ్యకు ప్రదీప్‌ చేసిన మెసేజ్‌లు చూసుకోండి అంటూ సవాల్‌ విసిరాడు.

అసలు సునిశిత్‌ ఎవరో జనాలకే సరిగా తెలియదు. ఇలా సెలబ్రిటీలపై ఎందుకు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. అయితే ఇప్పుడు తాజాగా అతనిపై పోలీసుల కేసు నమోదైంది. అతడిని పోలీసులు ఏ విధంగా విచారిస్తారో చూడాలి. ఇక హీరోగా చెప్పుకుంటున్న సునిశిత్‌.. విచారణలో పోలీసులకు ఇంకెన్ని కట్టు కథలు చెప్తాడో మరీ.!

లావణ్య ఫిర్యాదు పై కేసు నమోదు చేశాం: కె.వి.ఎం ప్రసాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ

హీరోయిన్‌ లావ్యణ్య త్రిపాఠి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.వి.ఎం ప్రసాద్‌ తెలిపారు. యూట్యూబ్‌ ఛానెల్స్‌లో సునిశిత్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలించామన్నారు. ఆడవారిపై అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదన్నారు. సునిశిత్‌ ఇతర సెలబ్రిటిలపై కూడా వ్యాఖ్యలు చేశారని, ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తామని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కెవిఎం ప్రసాద్‌ అన్నారు.

Next Story
Share it