74 రోజుల తరువాత..శ్రీనగర్ ఎన్.ఐ.టి పునఃప్రారంభం
By న్యూస్‌మీటర్ తెలుగు
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దుకు కొన్ని రోజుల ముందే శ్రీనగర్ ఎన్.ఐ.టీని మూసేయడం జరిగింది. ఆ తరువాత ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఆగస్ట్ 5న ప్రకటన చేసింది. ఆ తరుదాత కశ్మీర్ లోయ మొత్తాన్ని భారత భద్రతాదళాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాయి. సరిహద్దుదాటి కశ్మీర్‌లోకి అడుగుపెడుతున్న ఉగ్రవాదులకు మట్టుబెడుతున్నారు. ఈ నేపధ్యంలో లోయలో శాంతి నెలకొందని భావిస్తున్న కేంద్రం ఎన్.ఐ.టి పునఃప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే..కశ్మీర్ వెళ్లడానికి విద్యార్ధులు భయపడుతున్నారు. వారి పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించుకుంటున్నారు. ఇంటర్నెట్ కూడా పునరుద్ధరించకపోవడంతో అక్కడకి పోయి ఏం చేయాలన్న ఆలోచనలో విద్యార్ధులున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వందలాది మంది విద్యార్ధులు శ్రీనగర్ ఎన్.ఐ.టిలో చదువుతున్నారు.