శ్రీముఖి నవ్వుల వెనుక బాధ కూడా ఉందా?! ఏంటా బాధ..?!!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Oct 2019 5:44 PM GMTహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో శ్రీముఖి అంటే తెలియని వారు ఉండరు. చాలా షోలకు యాంకర్ గా ఉండి గుడ్ నేమ్ తెచ్చుకుంది. ఎప్పుడూ నవ్వుతూ, హ్యపీగా ఉండే శ్రీముఖి జీవితంలో చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా శ్రీముఖే చెప్పింది. బిగ్ బాస్ -3లో కంటెస్ట్‌గా ఉన్నారు శ్రీముఖి. టాస్క్‌లో భాగంగా తన జీవితంలో మిగిలిన ఓ చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు.
తాను ఒకబ్బాయిని ప్రేమించానని కొన్ని కారణాలు వలన బ్రేకప్ అయిందని చెప్పింది. " నా వ్యక్తిగత విషయాలను ఇప్పటి వరకు బయటకు చెప్పలేదు. అందరిలాగే నేనూ ఓ అబ్బాయిని ప్రేమించాను. అతని పేరు వద్దు. ఆ అబ్బాయికి కూడా నేను అంటే చాలా ఇష్టం. పెద్దలు కూడా మా ప్రేమను అంగీకరించారు. అదే సమయంలో రియాల్టీ షోలో వ్యాఖ్యాతగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్నాను. అంతా బాగుందని అనుకున్నాను. ఓ రోజు రియాల్టీ షో చేస్తున్నాను. అప్పుడే లవ్ బ్రేకప్ అనే వార్త తెలిసింది. మనసులో బాధ ఉంది. కాని షో లో ఉన్నా. అయినా నవ్వుతూనే షో పూర్తి చేశా. అది చాలా ఘోరమైన ఎడబాటు. ఆ సమయంలో నాకు చనిపోవాలని అనిపించింది. కాని..ఇప్పుడు ఆలోచిస్తే..అప్పుడు ఎందుకు అలా బాధ పడ్డానా అనే ప్రశ్న నాలో వస్తుంది..జీవితంలో మంచి స్థాయి వచ్చే వరకూ ఎవరూ ప్రేమ గురించి ఆలోచించవద్దు. తల్లిదండ్రుల తరువాతే ఏదైనా అని గుర్తుంచుకోండి" అని శ్రీముఖి చాలా బాధతో చెప్పారు.
ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే శ్రీముఖి వెనుక ఎంతటి లవ్ బ్రేకప్ రియల్ స్టోరీ ఉందో. ఆ తరువాత ఆమె దానిని తట్టుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఈ స్థాయికి ఎదిగారు. హ్యాట్సాఫ్ శ్రీముఖి.