గాజులు తొడిగిన చెయ్యి రెండు వైపులా ప‌దునుగ‌ల వేట క‌త్తిని ప‌ట్టింది. దాని ఎదురుగా ఆగ్ర‌హావేశాల‌తో ర‌గిలిపోతున్న చూపులు. క‌త్తి ప‌ట్టిన విధానం చూస్తుంటే ఎవ‌రినో ఒక‌ర్ని న‌ర‌క‌డం ప‌క్కా..! అని తెలుస్తుంది.

ఇన్నాళ్లు మాయ మాట‌లు న‌మ్మి వేధింపుల‌తో విసిగి.. వేశారా. ఇక ఉపేక్షించేది లేదు. మ‌హిళ అంటే అబ‌ల కాదు.. స‌బ‌ల అన్న విష‌యాన్ని నన్ను హింసించిన వారికి అర్ధ‌మ‌య్యేలా చెబుతా. విన‌క‌పోతే చేతిలోని వేట క‌త్తికి ప‌ని చెబుతా అన్న క‌సి త‌న ముఖ క‌వ‌ళిక‌ల‌లో క‌న‌ప‌డుతోంది.

ఇంత‌కీ ఎవ‌రామె..? వేట క‌త్తిని చేత‌బ‌ట్టాల్సిన అవ‌స‌ర‌మేమొచ్చింది..? ఇంత‌కీ ఆమె ఆగ్ర‌హావేశాల‌కు కార‌కులెవ‌రు..? అన్న విష‌యానికొస్తే..

శ్రీ‌రెడ్డి, ఈ పేరు తెలియ‌ని సినీ అభిమానంటూ ఉండ‌రు. అంత‌లా శ్రీ‌రెడ్డి సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. అదే స‌మ‌యంలో న‌ట‌న‌కు ప్రాధాన్య‌మున్న పాత్ర‌లు ఇస్తామంటూ కొంద‌రు సినీ ప్ర‌ముఖులు న‌మ్మించి, లైంగిక వాంఛ తీరాక ప్లేట్ ఫిరాయించారంటూ సెన్షేష‌న‌ల్ కామెంట్స్ చేసింది.

ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ కార్యాల‌యం ఎదుట అర్ధ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం కొన్ని రోజుల‌పాటు హ‌ల్‌చ‌ల్ చేసిన శ్రీ‌రెడ్డి ఆ వెంట‌నే త‌న మ‌కాంను కోలీవుడ్‌కు మార్చింది. వ‌ణుకు.. బెణుకు ఏ మాత్రం లేని శ్రీ‌రెడ్డి అక్క‌డి సినీ ప్ర‌ముఖుల‌పై ఓ రేంజ్‌లో కామెంట్స్ చేసింది. అయితే, శ్రీ‌రెడ్డి కామెంట్స్‌లో కొన్ని ఫోటోల‌తో స‌హా బ‌య‌ట‌ప‌డ‌గా, మ‌రికొన్ని మాత్రం ఆరోప‌ణ‌లుగానే మిగిలిపోయాయి.

ఇక అస‌లు విష‌యానికొస్తే, సోష‌ల్ మీడియా యాక్టివ్ యూజ‌ర్ల‌లో ఒక‌రిగా శ్రీ‌రెడ్డికి పేరున్న సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్‌.. హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ త‌న అభిమానుల‌ను నిత్యం అల‌రిస్తుంటుంది.

అందులో భాగంగానే శ్రీ‌రెడ్డి తాజాగా అప్‌లోడ్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ ఫోటోలో కుడి చేత్తో వేటక‌త్తిని ప‌ట్టిన శ్రీ‌రెడ్డి.. దానివైపుగా క‌సిగా చూస్తోంది. అంత‌టితో ఆగ‌ని శ్రీ‌రెడ్డి త‌న మ‌న‌సులోని భావాన్నీ పంచుకుంది.

నేను పిల్లి మాదిరి స‌మాజ శ్రేయ‌స్సు కోసమంటూ ట్వీట్ట‌ర్ ద్వారా పోరాడ‌ను. ఎక్క‌డ మార్పు కావాలో.. అక్క‌డికి నేను త్వ‌ర‌లోనే వ‌స్తానంటూ క‌త్తిప‌ట్టి ఉన్న ఫోటోకు ఆంగ్లంలో త‌న కామెంట్‌ను జోడించింది శ్రీ‌రెడ్డి. అయితే, శ్రీ‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్య‌లో ఓ రాజ‌కీయ పార్టీ నాయ‌కుడిని ఉద్దేశించిన‌విగా ఉన్నాయ‌ని తెలుస్తుంది.

I wl not talk r fight through Twitter like a cat.. I am coming soon in to society,where change has to happen..

Posted by Sri Reddy on Monday, November 25, 2019

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.