హన్సికతో 'ఫైట్'కు సిద్ధమైన శ్రీశాంత్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Oct 2019 2:01 PM ISTచెన్నై: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో జీవితకాల నిషేధాన్ని ఎదుర్కొంటున్నా క్రికెట్ శ్రీశాంత్‌కు ఇటీవలే ఊరట లభించింది. జీవితకాల నిషేధాన్ని ఏడేళ్లకు తగ్గించడంతో క్రికెటర్ శ్రీశాంత్ మరోసారి సినిమాల్లో బిజీ అయిపోయాడు. రెండు నెలల క్రితం బీసీసీఐ అంబుడ్స్‌మన్ డీకే జైన్.. శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని ఏడేళ్లకు కుదించిన నేపథ్యంలో వచ్చే ఏడాదితో అతనిపై ఉన్న నిషేధం గడువు ముగిసిపోనుంది. అయితే కొన్నాళ్లుగా వెండితెరపై దృష్టి సారించిన శ్రీశాంత్ కోలీవుడ్‌లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. హారర్, కామెడీతో రూపొందనున్న తమిళ సినిమాలో శ్రీశాంత్ నటించనున్నాడు. హరి, హరీశ్ అనే ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ హన్సిక లీడ్ రోల్‌లో చేయనుంది. అదే సమయంలో ఈ సినిమాలో శ్రీశాంత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. వీరిద్దరి మధ్య ఒక ఫైట్ సీన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అన్ని ఎలిమెంట్లు గల ఈ మసాలా సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ను శ్రీవారి ఫిల్మ్స్ బ్యానర్‌లో పి. రంగనాథన్ నిర్మించనున్నారు.