భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్, రేడియో జాకీ మహ్వశ్ మధ్య ఏదో ఉందంటూ వస్తున్న వదంతులపై చాహల్ స్పందించాడు. తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని తేల్చిచెప్పాడు.
మహ్వశ్, నా మధ్య అలాంటిదేమీ లేదు. ప్రజలు ఏది కావాలంటే అది అనుకోవచ్చు. ప్రస్తుతం నా దృష్టంతా వ్యక్తిగత జీవితాన్ని చక్కదిద్దుకోవడంపైనే ఉంది. తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని చాహల్ స్పష్టం చేశాడు. ఓ డిన్నర్‌లో తాము స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో కొందరు క్రాప్ చేసి, కేవలం ఇద్దరమే ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేశారని వివరించాడు. ఈ పుకార్ల వల్ల తాను, మహ్వశ్ తీవ్రమైన ట్రోలింగ్‌కు గురయ్యామని చాహల్ తెలిపాడు. తాను సింగిల్‌గానే ఉన్నానని, తనపై వచ్చే ఆరోపణల్లో నిజం లేదని ఆమె కూడా స్పష్టం చేసింది.