మొదటి టీ20లో జడేజా స్థానంలో చాహల్.. ఈ మార్పు ఎలా అంటారా..?

Yuzvendra Chahal replaces Ravindra Jadeja. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టీ20లో కంకషన్ సబ్స్టిట్యూట్ ను భారత్ రంగంలోకి

By Medi Samrat  Published on  4 Dec 2020 10:57 AM GMT
మొదటి టీ20లో జడేజా స్థానంలో చాహల్.. ఈ మార్పు ఎలా అంటారా..?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టీ20లో కంకషన్ సబ్స్టిట్యూట్ ను భారత్ రంగంలోకి దింపింది. జడేజా బ్యాటింగ్ ఆడుతున్న సమయంలో హెల్మెట్ కు బంతి బలంగా తాకింది.. అలాగే జడేజా పరిగెత్తడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడి స్థానంలో యజువేంద్ర చాహల్ బౌలింగ్ వేయనున్నాడు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ బీసీసీఐ కూడా ట్వీట్ చేసింది. ఆఖరి ఓవర్ లో ఓ బంతి జడేజా హెల్మెట్ ను బలంగా తాకింది. దీంతో జడేజాను రెండో ఇన్నింగ్స్ లో తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అతడిని వైద్యుల పర్యవేక్షన‌లో ఉంచనున్నామని బీసీసీఐ తెలిపింది. జడేజా స్థానంలో చాహల్ ను తీసుకోవడంపై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ అసహనాన్ని వ్యక్తం చేశారు. మ్యాచ్ రెఫరీతో వాదనకు కూడా దిగడాన్ని గమనించవచ్చు.

ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టీ20లో మ్యాచ్‌లో భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 161 ర‌న్స్ చేసింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీతో రాణించ‌గా.. చివ‌ర్లో ర‌వీంద్ర జ‌డేజా శ‌ర‌వేగంగా 44 ర‌న్స్ చేశాడు. జ‌డేజా కేవ‌లం 23 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 44 ర‌న్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఓపెన‌ర్ ధావ‌న్‌(1), కోహ్లీ(9)లు స్వ‌ల్ప స్కోర్ల‌కే నిష్క్ర‌మించారు.ఆరంభం నుంచి ఆస్ట్రేలియా బౌల‌ర్లు ఇండియ‌న్ బ్యాట్స్‌మెన్‌ను క‌ట్ట‌డి చేశారు.




Next Story