క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడిపోతున్నారని ప్రచారం సాగింది. ఇప్పుడు అది అధికారికంగా మారింది. ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. బాంబే హైకోర్టు వారికి సాధారణ ఆరు నెలల నిరీక్షణ వ్యవధిని దాటవేయడానికి అనుమతించింది. మార్చి 20, 2025 నాటికి వారి విడాకులను ఖరారు చేయాలని బాంబే హైకోర్టు ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. చాహల్ ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉన్నందున తీర్పు ఇవ్వాలని సూచించింది.
ఈ దంపతులకు 2020లో పెళ్లవగా, కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇక ధనశ్రీకి చాహల్ రూ. 4.75కోట్ల భరణం చెల్లించడానికి అంగీకరించినట్లు సమాచారం. ఈసారి ఐపీఎల్‌లో చాహల్ పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.