టీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్‌కు అరుదైన గౌరవం
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది.
By Srikanth Gundamalla Published on 26 April 2024 6:44 PM ISTటీమిండియా మాజీ ప్లేయర్ యువరాజ్‌కు అరుదైన గౌరవం
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది జూన్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీకి యూవీ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యాడు. ఈ మెగా టోర్నీకి ముందు అమెరికాలో నిర్వహించే పలు ప్రమోషన్ ఈవెంట్లలో యువరాజ్ సింగ్ పాల్గొననున్నాడు. టీ20 వరల్డ్ కప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక అవ్వడం పట్ల యువరాజ్‌సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లోనే తాను అద్భుతమైన జ్ఞాపకాలు పోగు చేసుకున్నానని యువరాజ్ సింగ్ అన్నాడు.
టీ20 వరల్డ్ కప్‌తోనే తన క్రికెట్ జర్నీలో మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయని యువరాజ్ గుర్తు చేసుకున్నాడు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడం ఎప్పటికీ మర్చిపోలేని సందర్భంగా మిగిలిపోయిందని అన్నాడు. ఇక అలాంటి టీ20 వరల్డ్ కప్‌కే బ్రాండ్ అంబాసిడర్‌గా కొత్త పాత్ర పోషించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు. ఇక టీ20 క్రికెట్ ఆడేందుకు వెస్టిండీస్ గొప్ప ప్రదేశంగా యూవీ పేర్కొన్నాడు. ఇక అమెరికాలో కూడా క్రికెట్ విస్తరిస్తోందనీ.. న్యూయార్క్‌లో జూన్ 9న భారత్, పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారని యూవీ చెప్పాడు. ప్రచారకర్తగా గొప్ప ఆటగాళ్లను కలుసుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు వెల్లడించాడు.