ఇష్టమైన బ్యాటింగ్ భాగస్వామి పేరు చెప్పిన యువరాజ్.. తెలిస్తే షాక్ అవుతారు..!
యువరాజ్ సింగ్ ఇటీవలి ఇంటర్వ్యూలలో అనేక సంచలన విషయాలు వెల్లడించాడు.
By - Medi Samrat |
యువరాజ్ సింగ్ ఇటీవలి ఇంటర్వ్యూలలో అనేక సంచలన విషయాలు వెల్లడించాడు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన ఇటీవల ఎంఎస్ ధోనీ, కపిల్ దేవ్‌లకు క్షమాపణ చెప్పాడు. యువరాజ్, ఎంఎస్ ధోనీ చాలా కాలం పాటు డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నారు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్లలో వీరిద్దరూ సభ్యులుగా ఉన్నారు.
రెండు ఐసీసీ టోర్నమెంట్లలోనూ ఎంఎస్ ధోనీ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా, రెండు సందర్భాల్లోనూ యువరాజ్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచాడు. ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌తో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ తన అభిమాన బ్యాటింగ్ భాగస్వామి గురించి మాట్లాడాడు. ఒక ర్యాపిడ్-ఫైర్ రౌండ్‌లో మైఖేల్ వాన్, యువరాజ్ సింగ్‌ను పలు ప్రశ్నలు అడిగాడు.
ఆ ప్రశ్నలు యధాతదంగా..
మీకు చూడటానికి, ఆడటానికి అత్యంత ఇష్టమైన ఫార్మాట్ ఏది?
యువరాజ్: టెస్ట్ క్రికెట్.
మీరు ఎవరితో బ్యాటింగ్ చేయాలనుకుంటున్నారు?
యువరాజ్: బహుశా టెండూల్కర్‌తో.
మీకు ఇష్టమైన సినిమా?
యువరాజ్: ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ.
మీకు ఇష్టమైన నటుడు?
యువరాజ్: రణబీర్ కపూర్, షారుఖ్ ఖాన్.
ఆడటానికి ఇష్టమైన దేశం?
యువరాజ్: ఇంగ్లాండ్, న్యూజిలాండ్.
క్రికెట్ కాకుండా ఇష్టమైన క్రీడ?
యువరాజ్: ప్రస్తుతం గోల్ఫ్.
ఇష్టమైన మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాడు?
యువరాజ్: గతంలో: వాన్ నిస్టెల్ రూయ్, రొనాల్డో. ప్రస్తుతం: బ్రూనో ఫెర్నాండెజ్.
ఇష్టమైన బ్యాటింగ్ భాగస్వామి?
యువరాజ్: ఎంఎస్ ధోని.
మీరు ఎదుర్కోవడానికి ఇష్టపడే బౌలర్ ఎవరు?
యువరాజ్: నేను చెప్పను. బహుశా నా సొంత బౌలింగ్ లేదా సమిత్ పటేల్ బౌలింగ్ నాకు ఇష్టం.
ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను ఎవరు గెలుస్తారు?
యువరాజ్: మా అత్తమామలు ఇంగ్లాండ్ వాళ్ళు, అందుకే ఇంగ్లాండ్ గెలవాలని నేను కోరుకుంటాను. కానీ మీరు ప్రతీసారి సెమీ-ఫైనల్స్ కి వెళ్తారు. 1966లో గెలిచారు. మళ్ళీ ఎప్పుడు? నేను ప్రీమియర్ లీగ్ చూస్తాను కాబట్టి వాళ్ళు గెలవాలని కోరుకుంటాను.
ఇటీవల, ఆరు సిక్సర్లు కొట్టినందుకు యువరాజ్ సింగ్‌కు మాజీ ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ కారు బహుమతిగా ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు యువరాజ్ సింగ్ అసలు నిజం వెల్లడించారు. యువరాజ్ మాట్లాడుతూ.. "ఎవరైనా ఆరు సిక్సర్లు కొడితే వారికి ఫెరారీ ఇస్తానని ఆయన నాతో చెప్పారు. సరిగ్గా అదే జరిగింది, నేను 'నా ఫెరారీ ఎక్కడ?' అని అడిగాను. ఆయన పోర్షే 911 ఇస్తానని వాగ్దానం చేశారు, నేను మళ్ళీ 'నా పోర్షే ఎక్కడ?' అని అడిగాను. దానికి ఆయన 'నీ కారు నీకు వస్తుంది' అని చెప్పారు."
"'నేను తర్వాతి మ్యాచ్ గెలిస్తే నాకు ఫెరారీ వస్తుందా?' అని అడిగాను. దానికి ఆయన, 'లేదు, లేదు, లేదు, నీకు పోర్షే మాత్రమే వస్తుంది' అని చెప్పారు. కానీ నిజానికి నేను ఆయన దగ్గరే నా కారును పొందాను," అని యువరాజ్ సింగ్ 'ది ఓవర్‌ల్యాప్ క్రికెట్'తో అన్నారు. "నాకు BMW M5 వచ్చింది. ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి."