ఐపీఎల్-2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ వ్యహరిస్తున్నాడు. ట్రావిస్ హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికి కిషన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదే విషయంపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఎనిమిదేళ్లుగా జట్టుతో ఉన్న అభిషేక్ శర్మకు కాకుండా కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై యువీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభిషేక్ 2017 నుంచి సన్‌రైజర్స్ జట్టుతో పాటు ఉన్నాడని, కానీ కిషన్ మాత్రం గతేడాదే ఎస్ఆర్‌హెచ్ జట్టులోకి వచ్చాడన్నాడు. అభిషేక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించకపోవడం నన్ను నిరాశపరిచింది. ఇషాన్ కిషన్ అంటే నాకు కూడా ఇష్టమే. అతడు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి ఎదిగాడు. కానీ అభిషేక్ శర్మ గత 7 ఏళ్లగా ఎస్ఆర్‌హెచ్ జట్టుతో పాటు ఉన్నాడని తెలిపాడు. గతంలో కూడా నాకు ఇలానే జరిగిందని, 2007లో నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాను. సెహ్వాగ్, భజ్జీ వంటి సీనియర్లు ఉన్నారు.కానీ ఎక్కడి నుంచో ఎంఎస్ ధోనీ వచ్చి కెప్టెన్ అయ్యాడు. అప్పట్లో అది నాకు ఎలా అనిపించిందో, ఇప్పుడు అభిషేక్ కూడా అలాగే ఫీల్ అవుతుంటాడు. అయితే ధోని మాత్రం కెప్టెన్‌గా భారత్‌కు గొప్ప విజయాలు అందించాడు. అందుకు అతడే అర్హడు అన్పించిందని యువరాజ్ తెలిపాడు.