భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాలి

భారత్-పాకిస్థాన్ జట్లు తలపడినప్పుడల్లా క్రికెట్ మైదానంలో హైవోల్టేజ్ మ్యాచ్ కనిపిస్తుంది. భార‌త్‌-పాక్ మ్యాచ్ వ‌స్తే అభిమానులు టీవీ స్క్రీన్ నుండి ముఖం ప‌క్క‌కు తిప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌రు

By Medi Samrat  Published on  23 May 2024 3:42 AM GMT
భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాలి

భారత్-పాకిస్థాన్ జట్లు తలపడినప్పుడల్లా క్రికెట్ మైదానంలో హైవోల్టేజ్ మ్యాచ్ కనిపిస్తుంది. భార‌త్‌-పాక్ మ్యాచ్ వ‌స్తే అభిమానులు టీవీ స్క్రీన్ నుండి ముఖం ప‌క్క‌కు తిప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే.. 2012 నుంచి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. అయితే ఐసీసీ ఈవెంట్‌లలో ఇరు జట్లూ తలపడుతున్నాయి. T20 ప్రపంచ కప్ 2024 కు ముందు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ యూనిస్ ఖాన్ నుండి ఓ అభ్య‌ర్థ‌న వ‌చ్చింది. భారత్‌ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సిరీస్ విష‌య‌మై పాకిస్తాన్ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్ డిమాండ్ చేశాడు. యూనిస్ ఖాన్ కెప్టెన్సీలో 2009 T20 ప్రపంచ కప్ టైటిల్‌ను పాకిస్తాన్ జట్టు గెలుచుకుంది.

యూనిస్ ఖాన్ పాకిస్తాన్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్-పాకిస్తాన్ మధ్య సిరీస్ ఉండాలని మేము ఎప్పటినుంచో చెబుతున్నాము. ఇది కేవలం రెండు జట్లకు సంబంధించినది కాదు. ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు జరిగి ఏ జట్టు అయినా ఓడిపోతే.. వారిపై ఒత్తిడి రెట్టింపు అవుతుంది. మళ్లీ ఆడి గెలిచినప్పుడు ఒత్తిడి పోతుంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌తోనే ఆటగాళ్లు స్టార్‌లయ్యారు. క్రీడల కోసం ఇరు దేశాలు కలిసి రావాలని నా అభిప్రాయం అని అన్నారు. ఇరు దేశాల ప్రభుత్వాలు ఏకతాటిపైకి రావాలి. ఆటగాళ్ళు కలిసి ఉన్నారు. చాలా మంచి వాతావరణం ఉంది. ఆటగాళ్లు తమత‌మ‌ ఆట గురించి ఆలోచనలను పంచుకుంటున్నారు. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ముందుకు రావాలి, భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య సిరీస్ జరగాలన్నారు.

Next Story