IND Vs ENG: కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్
ఇండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 7 March 2024 4:27 PM ISTIND Vs ENG: కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన యశస్వి జైస్వాల్
ఇండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఐదు టెస్టుల్లో భాగంగా చివరి టెస్టు మ్యాచ్ ధర్మశాల వేదిగా సాగుతోంది. ఇప్పటికే 3-1 తేడాతో టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. చివరి టెస్టు మ్యాచ్ నామమాత్రంగానే సాగుతోంది. అయితే.. ఈ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డును సాదించాడు. ఇంగ్లండ్‌పై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీని అధిగమించాడు.
విరాట్ కోహ్లీ 2016-17లో ఇంగ్లండ్‌తో టెస్టు సరీసుల్లో 8 ఇన్నింగ్స్‌లు ఆడి 655 పరుగులు చేశాడు. ఇక తాజాగా యశస్వి జైస్వాల్ 2024లో ఇంగ్లండ్ టెస్టుల్లో 9 ఇన్నింగ్స్‌లు ఆడి 656 పరుగులు పూర్తి చేశాడు. అండర్సన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. మరోవైపు వీరిద్దరి తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సరీసుల్లో అధిక స్కోర్లు చేసిన వారి జాబితాలో రాహుల్ ద్రావిడ్ 2022లో 6 ఇన్నింగ్స్‌లు ఆడి 602 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 2018లో 10 ఇన్నింగ్స్‌లు ఆడి 593 పరుగులు చేశాడు.
ఇక ఒకే టెస్టు సిరీస్‌లో ఇతర టీమ్‌లపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో సునీల్ గవాస్కర్ ఉన్నారు. గవాస్కర్ ఒకే టెస్టు సరీస్‌లో రెండుసార్లు 700కు పైగా పరుగులు చేశారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 692 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంకా కొన్ని పరగులు చేస్తే గవాస్కర్ రికార్డును కూడా యశస్వి జైస్వాల్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి.
సునీల్ గవాస్కర్ – 774 పరుగులు – వెస్టిండీస్‌పై (1970-71లో)
సునీల్ గవాస్కర్ – 732 పరుగులు – వెస్టిండీస్‌పై (1978-79 )
విరాట్ కోహ్లీ – 692 – ఆస్ట్రేలియా పై 2014-15 (ఆస్ట్రేలియాలో)
యశస్వి జైస్వాల్ – 656* పరుగులు – ఇంగ్లాండ్ పై (2024లో )
విరాట్ కోహ్లీ – 655 పరుగులు – ఇంగ్లాండ్ పై (2016-17లో)