'రనౌట్ ఆటలో భాగమే'.. యశస్వి జైస్వాల్ సంచలన ప్రకటన
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీని కోల్పోయాడు.
By - Medi Samrat |
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీని కోల్పోయాడు. రనౌట్ కావడంతో తిరిగి పెవిలియన్ బాట పట్టాడు. 175 పరుగుల వద్ద జైస్వాల్ ఔటయ్యాడు. జైస్వాల్ రనౌట్ అయిన తర్వాత, అందరూ గిల్‌ను విలన్‌గా చూడటం ప్రారంభించారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ తన రనౌట్‌పై స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇది గేమ్‌లో భాగమని జైస్వాల్ అన్నాడు. ఏం సాధించాలనే దానిపైనే తన దృష్టి ఉంటుందని అన్నారు. వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని జైస్వాల్ అన్నాడు.
మ్యాచ్ అనంతరం జైస్వాల్ మాట్లాడుతూ.. వీలైనంత ఎక్కువసేపు ఆడేందుకు ప్రయత్నిస్తా. నేను మైదానంలో ఉంటే, నేను ఆటను ముందుకు నెట్టి, నాకు వీలైనంత వరకు ఆడాలి. ఇది ఆటలో భాగమే.. నేను ఏమి సాధించగలను.. నా జట్టు యొక్క లక్ష్యాలు ఏమిటి అనే ఆలోచన ఎల్లప్పుడూ ఉంటుంది, నేను గేమ్‌లో ఉండటానికి ప్రయత్నిస్తాను.. బహుశా ఒక గంట బ్యాటింగ్ చేయగలనని, నాకు పరుగులు చేయడం సులభం అని నేను అనుకున్నాను. వికెట్ ఇంకా బాగానే ఉంది, మేము చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాము, వీలైనంత త్వరగా వారిని మళ్లీ అవుట్ చేయాలని చూస్తామన్నాడు.
అత్యధిక వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయిన యశస్వి జైస్వాల్ భారత్ తరఫున మూడో ఆటగాడిగా నిలిచాడు. 1989లో లాహోర్ మైదానంలో పాకిస్థాన్‌పై 218 పరుగుల స్కోరు వద్ద రనౌట్ అయిన ఈ అవాంఛిత జాబితాలో సంజయ్ మంజ్రేకర్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఓవల్‌లో 2002లో ఇంగ్లండ్‌పై 217 పరుగుల స్కోరు వద్ద రనౌట్ అయిన రాహుల్ ద్రవిడ్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 2001లో కోల్‌కతా టెస్టులో ఆస్ట్రేలియాపై 180 పరుగుల వద్ద ఔట్ అయిన రాహుల్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.