రెండో రోజన్న ఆట ప్రారంభమయ్యేనా..?
WTC Final Weather Report on Day 2.అరంగ్రేట వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌పై ఎన్నో అంచనాలు, మరెన్నో విశ్లేషణలు,
By తోట వంశీ కుమార్
అరంగ్రేట వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్‌పై ఎన్నో అంచనాలు, మరెన్నో విశ్లేషణలు, ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే.. వారి ఆశలను ఆడియాలు చేస్తూ వరుణుడు తొలి రోజును తుడిచిపెట్టేశాడు. సమఉజ్జీలుగా బావిస్తున్న భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగుతుందని బావించగా.. కనీసం టాస్ అయినా పడకుండానే తొలి రోజును ఆటను రద్దు చేశారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో రోజు వాతావరణం ఎలా ఉంటుందన్న దానిపైనే పడింది.
కనీసం రెండో రోజు అయిన మ్యాచ్ జరుగుతుందా అన్న సందేహాలు మొదలయ్యాయి. అయితే.. శుక్రవారంతో పోలిస్తే శనివారం వాతావరణం మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. ఉదయం ఎండ కాస్తుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. రోజంతా అలాగే ఉండదని, మధ్యాహ్నాం తరువాత 60శాతం వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రెండో రోజు కూడా పూర్తి స్థాయిలో మ్యాచ్ జరిగే అవకాశం లేదని అంటున్నారు. అయితే.. కొన్ని ఓవర్ల మ్యాచ్ మాత్రం సాధ్యమేనని చెబుతున్నారు.
ఈ పైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే అందుబాటులో ఉంది. తొలి రోజు పూర్తిగా ఆట రద్దు అయిన నేపథ్యంలో ఆరో రోజు వరకు ఆటను కొనసాగించ వచ్చు. అయితే.. మిగిలిన రోజుల్లో వరుణుడు తెరిపినిస్తాడా..? లేదా అన్న దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఒక వేళ మ్యాచ్ ఫలితం తేలకుంటే.. ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చెప్పిన సంగతి తెలిసిందే.