ప్రారంభమైన వరుణుడి ఆట.. మొదటి సెషన్ రద్దు
WTC Final Rain washes out opening session in Southampton.ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని
By తోట వంశీ కుమార్
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. మరికొద్దిసేపటిలో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కాబోతుందని సగటు అభిమాని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఈ తరుణంలో సగటు క్రీడాభిమాని ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. సౌతాంప్టన్‌లో నిన్నటి నుంచి వర్షం కురుస్తుంది. ఈ రోజు ఉదయం కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. దీంతో గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు టాస్ వేయకుండానే తొలి సెషన్‌ను పూర్తిగా రద్దు చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్వీట్ చేసింది.
వరుణుడు తెరిపినిచ్చి.. మ్యాచ్‌కు గ్రౌండ్‌ను సిద్దం చేస్తే రెండో సెషన్ లోనైనా ఆట ప్రారంభమైయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌కు వరుణుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రిజర్వు డేతో కలిపి మొత్తం ఆరు రోజులు పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినట్లుగానే తొలి రోజు నుంచే వరుణుడి ఆట ప్రారంభమైంది.
Update: Unfortunately there will be no play in the first session on Day 1 of the ICC World Test Championship final. #WTC21
— BCCI (@BCCI) June 18, 2021
ఫైనల్ మ్యాచ్ కి వరుణ గండం పొంచి ఉందన్న విషయం పై నిన్న ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ ట్విట్టర్లో ఓ ట్వీట్ ఇక్కడ మ్యాచ్ ప్రారంభానికి ఒక రోజు ముందు నుంచే వర్షం మొదలవుతుందని పేర్కొన్నారు.
రిజర్వ్ డేతో కలిపి ఆరు రోజుల పాటు ఆట సాధ్యం కాక.. ఫలితం తేలకుంటే.. ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తామని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించిన సంగతి తెలిసిందే.