భారత్‌కు పతకం తీసుకుని రానున్న రవి దహియా

Wrestler Ravi Kumar Dahiya enters into Final.టోక్యో ఒలింపిక్స్‌ రెజ్లింగ్ సెమీ ఫైనల్స్‌లో 57 కేజీల బరువు విభాగంలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Aug 2021 11:30 AM GMT
భారత్‌కు పతకం తీసుకుని రానున్న రవి దహియా

టోక్యో ఒలింపిక్స్‌ రెజ్లింగ్ సెమీ ఫైనల్స్‌లో 57 కేజీల బరువు విభాగంలో రవి కుమార్ దహియా విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. బుధవారం జరిగిన సెమీ ఫైనల్స్‌లో కజకిస్తాన్‌కు చెందిన సానాయేవ్ నూరిస్లామ్‌ని ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాడు. ఓ దశలో రవికుమార్ 3-9తో వెనుకబడి ఉండగా మ్యాచ్ ముగిసేందుకు 30 సెకన్ల సమయం మాత్రమే మిగిలుంది. మ్యాచ్ గెలవలేని స్థితిలో రవికుమార్ ఉన్న సమయంలో.. తన ప్రత్యర్థి నూర్లిసామ్ సనయేవ్ ను పట్టుకుని ఉడుం పట్టు పట్టాడు. ప్రత్యర్థిని ఫాలౌట్ చేయడంతో విజయం సాధించాడు. భారత్ కు పతకం కూడా ఖాయమైంది. రవికుమార్ ఫైనల్లో రష్యా ఒలింపిక్ కమిటీ (ఆర్ఓసీ) జట్టుకు చెందిన ఉగుయేవ్ తో తలపడనున్నాడు.

రెజ్ల‌ర్ దీపక్ పూనియా సెమీస్‌లో ఓటమి పాలయ్యాడు. 86కేజీల ఈవెంట్‌లో అమెరికా రెజ్ల‌ర్ డేవిడ్ మోరిస్ టేల‌ర్ చేతిలో దీప‌క్ ఓటమి పాలయ్యాడు. టెక్నిక‌ల్ సుపీరియార్టీ ప‌ద్ధ‌తిలో టేల‌ర్ 10-0 స్కోర్‌తో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. అమెరికా రెజ్ల‌ర్ టేల‌ర్ దూకుడుగా ఆడాడు. ఇక రెజ్ల‌ర్ దీప‌క్‌ బ్రాంజ్ మెడ‌ల్ కోసం మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

Next Story
Share it