విమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ముంబై ఇండియన్స్ రెండో సారి సాధించింది. ఢిల్లీ కేపిటల్స్‌తో ముంబైలో ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబై. మూడు ఐపీఎల్ సీజన్స్ లోనూ ఫైనల్ కు చేరిన ఢిల్లీ జట్టుకు వరుసగా మూడోసారికి కప్పు చేజారింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసింది. నట్ స్కివర్ బ్రంట్ 30 పరుగులు చేసింది. జట్టులో మిగతా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఇక ఛేజింగ్ లో ఢిల్లీ కేపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో మరిజానే కాప్ 40 పరుగులు చేయగా, జెమీమా రోడ్రిగ్స్ 30, నికీ ప్రసాద్ 25 పరుగులు చేశారు.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా హర్మన్‌ప్రీత్ కౌర్, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నట్ స్కివర్ బ్రంట్ అవార్డులు అందుకున్నారు.