WPL-2024: ఈ సారైనా ఆర్సీబీ కల నెరవేరుతుందా?
ఇండియాలో క్రికెట్‌కు క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది.
By Srikanth Gundamalla Published on 17 March 2024 1:57 PM ISTWPL-2024: ఈ సారైనా ఆర్సీబీ కల నెరవేరుతుందా?
ఇండియాలో క్రికెట్‌కు క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా భారత్‌లో జరిగే ఐపీఎల్‌కు ఫ్యాన్స్ మామూలుగా ఉండరు. ఈ లీగ్ కొనసాగినన్ని రోజులు క్రికెట్ అభిమానులకు పండగలా ఉంటుంది. తమ అభిమాన టీమ్‌ను ఎంకరేజ్ చేసేందుకు స్టేడియాలకు తరలి వెళ్తుంటారు. అయితే.. మెన్స్ ఐపీఎల్ తరహాలోనే మహిళల ప్రీమియర్ లీగ్ కూడా జరుగుతోంది. డబ్ల్యూపీఎల్-2024 పోరు చివరి దశకు చేరుకుంది. విజేత ఎవరో తేలిపోయే సమయం వచ్చేంది. ఆదివారం సాయంత్రం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. గత సీజన్‌లో కప్పు ముంగిట బోల్తాపడి రన్నరప్‌గా నిలిచింది ఢల్లీ. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఫైనల్‌కు చేరింది.
సాధారణంగానే ఈ లీగ్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా కొనసాగుతుంటాయి. చివరి బంతి వరకు ఫలితం సస్పెన్స్‌లోనే ఉంటుంది. ఇలాంటి మ్యాచ్‌లు సీజన్లలో ఎన్నో జరుగుతుంటాయి. డబ్ల్యూపీఎల్ తొలి సీజ్ అయిన గతేడాది ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఈసారి ఫైనల్ ఆర్‌సీబీ, ఢిల్లీ చేరడంతో మరో కొత్త టీమ్ కప్ కొట్టినట్లు అవుతుంది. గతేడాది ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ ఏడాది 8 మ్యాచుల్లో 6 గెలిచిన ఢిల్లీ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. కెప్టెన్ మెగ్ లానింగ్ 308 పరుగులతో ఫామ్‌లో ఉంది. షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ సైతం రాణిస్తే ఆ జట్టుకు తిరుగు ఉండదు. బౌలింగ్‌లో మరిజేన్ కాప్, జొనాసెన్, రాధ యాదవ్‌లు నిలకడగా రాణిస్తున్నారు.
వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన ఆర్‌సీబీ ఫైనల్లో కూడా అదే జోరు కొనసాగించాలని బావిస్తోంది. లీగ్ దశలో 8 మ్యాచుల్లో 4 విజయాలతో ప్లేఆఫ్స్‌కు వచ్చింది. గత రెండు మ్యాచుల్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పెర్రీ రాణించింది. దాంతో.. ఆ జట్టు పెర్రీపై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఎంతో ఫ్యాన్ బేస్ ఉన్న ఈ టీమ్ ఎలాగైనా కప్ప్ కొట్టాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు. గత మ్యాచుల్లో టాప్ ఆర్డర్ విఫలం అయ్యింది. దాంతో.. అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఫైనల్‌లో కెప్టెన్ స్మృతి మందాన తోపాటు రిచా ఘోష్ రాణిస్తేనే బెంగళూరుకు గెలిచి అవకాశాలు ఉన్నాయి. ఇక ఫైనల్ పోరుకు ఢిల్లీ, బెంగళూరు మహిళల జట్లు రెడీ అవుతున్నాయి.