కొత్త స్ట్రోక్స్‌‌‌‌లను నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి: విరాట్ కోహ్లీ

ఓ బ్యాటర్‌‌‌‌గా టెక్నిక్‌‌‌‌ కంటే కొత్త స్ట్రోక్స్‌‌‌‌లను నేర్చుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని కోహ్లీ సూచించాడు.

By Srikanth Gundamalla  Published on  11 Nov 2023 4:13 AM GMT
world cup-2023, virat kohli, team india,

కొత్త స్ట్రోక్స్‌‌‌‌లను నేర్చుకోవడంపై దృష్టి పెట్టాలి: విరాట్ కోహ్లీ

వన్డే వరల్డ్‌ కప్‌-2023లో భారత్‌ దూసుకెళ్తోంది. కప్‌ కొట్టేలాగే కనిపిస్తోందని అభిమానులు అంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క ఓటమి లేని టీమ్‌గా నిలిచింది. దాంతో.. తమకు ఎదురెవ్వరు అన్నట్లుగా స్ట్రాంగ్‌గా నిలబడింది టీమిండియా. జట్టులో అందరూ బాగా రాణిస్తున్నారు. ఓపెనర్‌గా వస్తోన్న కెప్టెన్‌ రోహిత్‌ అయితే మెరుపు ఇన్నింగ్స్‌తో మంచి ఆరంభాన్ని అందిస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చే బ్యాటర్లు కూడా తమ పాత్రను పోషిస్తూ టీమిండియా విజయంలో భాగం అవుతున్నారు. ఇటు బౌలింగ్‌లోనూ టీమిండియా ది బెస్ట్‌గా ఉంది. పేసర్లు అయితే ప్రత్యర్థి టీమ్‌లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన టీమిండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ.. ఓ బ్యాటర్‌‌‌‌గా టెక్నిక్‌‌‌‌ కంటే కొత్త స్ట్రోక్స్‌‌‌‌లను నేర్చుకోవడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని సూచించాడు. టెక్నిక్, నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడంలో రెండు విషయాలు ఉంటాయన్నాడు. ఒకటి నేర్చుకున్న టెక్నిక్‌ మ్యాచ్‌లు గెలవడానికి ఉపయోగపడటం అయితే.. మరోటి బ్యాటింగ్ మెరుగు పడటం అన్నాడు. బ్యాటింగ్‌లో మెరుగుపడటం అనే విషయం గురించి చాలా మందికి అవగాహన ఉందని విరాట్ అభిప్రాయపడ్డాడు. మన బ్యాటింగ్‌కు ఇంకా ఏం చేరిస్తే విజయానికి కృషి చేయచ్చో ఆలోచిస్తే ఆట మెరుగవుతుందని విరాట్ అన్నాడు. పరిపూర్ణమైన బ్యాటర్‌ కావడంపై దృష్టి పెట్టడం కంటే కొత్త షాట్లు నేర్చుకోవడం మంచిదని చెప్పాడు. దీని వల్ల పరుగులు వస్తాయి.. జట్టు గెలుస్తుంది అని విరాట్‌ అన్నాడు.

గతేడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో పేసర్‌ హారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో విరాట్‌ నేరుగా కొట్టిన సిక్సర్‌ని అభిమానులు మరిచిపోలేరు. అయితే.. రవూఫ్‌ బౌలింగ్‌లో కొట్టిన ఆ సిక్సర్‌ను చాలాసార్లు చూశా అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. అది ఎంతో ప్రత్యేకమైన సమయమనీ... ఈరోజు వరకు ఆ షాట్‌ ఎలా ఆడానో నాకే తెలియదు అని కోహ్లి పేర్కొన్నాడు.

వరల్డ్‌ కప్‌లో దాదాపు న్యూజిలాండ్‌తో సెమీఫైనల్‌ పోరు ఖాయమైన నేపథ్యంలో... శుక్రవారం శిక్షణలో భాగంగా కోహ్లి.. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ను ఎక్కువగా ఎదుర్కొన్నాడు. 2021 నుంచి లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్నర్లపై కోహ్లి సగటు 13 మాత్రమే. ఈ నేపథ్యంలో జడేజా బౌలింగ్‌లో విరాట్‌ వీలైనంత ఎక్కువసేపు ప్రాక్టీస్‌ చేశాడు. దాంతో.. బ్యాటింగ్‌ను అన్ని రకాలుగా మెరుగుపర్చేందుకు కసరత్తు చేస్తున్నాడు.

Next Story