వ‌ర‌ల్డ్‌ ఛాంపియన్‌షిప్.. నిరాశ ప‌రిచిన నీరజ్ చోప్రా.. సచిన్‌ను వెంటాడిన బ్యాడ్‌ల‌క్‌..!

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025 ఆరవ రోజున పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్‌లో ట్రినిడాడ్ మరియు టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

By -  Medi Samrat
Published on : 18 Sept 2025 6:23 PM IST

వ‌ర‌ల్డ్‌ ఛాంపియన్‌షిప్.. నిరాశ ప‌రిచిన నీరజ్ చోప్రా.. సచిన్‌ను వెంటాడిన బ్యాడ్‌ల‌క్‌..!

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2025 ఆరవ రోజున పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్‌లో ట్రినిడాడ్ మరియు టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఒకప్పుడు 19 ఏళ్ల వయసులో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన కేషోర్న్.. 13 ఏళ్ల తర్వాత కూడా త‌న‌లో స‌త్తా ఉంద‌ని చూపించాడు.

మొదటి ప్రయత్నంలో కేషోర్న్ వాల్కాట్ జావెలిన్‌ను 81.22 మీటర్ల దూరం విసిరాడు. రెండో ప్రయత్నంలో 87.83, మూడో ప్రయత్నంలో 81.65, నాలుగో ప్రయత్నంలో 88.16, ఐదో ప్రయత్నంలో 85.84, చివరి ప్రయత్నంలో 83 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. జర్మనీకి చెందిన అండర్సన్ పీటర్స్ రజత పతకాన్ని గెలుచుకోగా, అమెరికాకు చెందిన కర్టిస్ థాంప్సన్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

అదే సమయంలో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నిరాశపరిచాడు. ఫైనల్లో నీరజ్ చోప్రా అత్యధికంగా 84.03 మీటర్లు విసిరి.. తన చివరి ప్రయత్నంలో ఫౌల్ చేశాడు. భారత్ తరఫున సచిన్ యాదవ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. సచిన్ నాలుగో స్థానంలో నిలిచాడు. దీంతో అత‌డు పతకం సాధించే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. సచిన్ తన మొదటి మూడు ప్రయత్నాలలో 85 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. తన చివరి ప్రయత్నంలో అతడు 80.95 మీటర్ల దూరం మాత్ర‌మే విసిరాడు.

Next Story