మహిళల టీ20 ఆసియా కప్.. పాకిస్థాన్‌పై టీమిండియా విక్ట‌రీ..!

మహిళల టీ20 ఆసియా కప్ 2024లో భారత్ నేడు పాకిస్థాన్‌తో తలపడింది. దంబుల్లాలోని క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

By Medi Samrat  Published on  19 July 2024 4:08 PM GMT
మహిళల టీ20 ఆసియా కప్.. పాకిస్థాన్‌పై టీమిండియా విక్ట‌రీ..!

మహిళల టీ20 ఆసియా కప్ 2024లో భారత్ నేడు పాకిస్థాన్‌తో తలపడింది. దంబుల్లాలోని క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న‌ పాకిస్థాన్ భారత్ బౌలింగ్ ధాటికి కుప్పకూలింది. పూజా వస్త్రాకర్ రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసి పాకిస్థాన్‌కు తొలి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రేయాంక పాటిల్ మిడిల్ ఆర్డర్‌ను షేక్ చేశారు.

పాక్ తరఫున సిద్రా అమీన్ అత్యధికంగా 25 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. తుబా, ఫాతిమాలు చెరో 22 పరుగుల చొప్పున‌ చేశారు. భార‌త బౌల‌ర్లో దీప్తి శర్మ మూడు వికెట్లు తీసింది. పూజా, రేణుక, శ్రేయాంక పాటిల్ చెరో రెండు వికెట్లు చొప్పున ప‌డ‌గొట్టారు.

అనంత‌రం చేధ‌న‌కు దిగిన భార‌త్ బ్యాట్స్‌మెన్ 85 ప‌రుగుల భాగ‌స్వామ్యంతో శుభారంభం అందించారు. ఓపెన‌ర్ స్మృతి(31 బంతుల్లో 45, 9 ఫోర్లు) స‌యేదా బౌలింగ్‌లో అలియా రియాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైంది. ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌రో ఓపెన‌ర్‌(40) కూడా బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యింది. త‌ర్వాత‌ హేమ‌ల‌త(14) న‌ష్రా సంధూ బౌలింగ్‌లో పెవిలియ‌న్ చేరింది. కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌(5), రోడ్రిగ్ర్‌((6) మ‌రో వికెట్ ప‌డ‌కుండా జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు.

Next Story