చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు

వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత అమ్మాయిలు రికార్డు గెలుపును నమోదు చేశారు.

By Srikanth Gundamalla  Published on  24 Dec 2023 1:36 PM IST
women cricket, australia, india, test match,

చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు

భారత మహిళా క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది. వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత అమ్మాయిలు రికార్డు గెలుపును నమోదు చేశారు. పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించి.. ఆ జట్టుపై టెస్టుల్లో తొలి గెలుపును అందుకున్నారు. బ్యాటింగ్తో పాటు.. బౌలింగ్‌లో కూడా సత్తా చాటిన భారత అమ్మాయిలు మూడున్నర రోజుల్లోనే టెస్టు మ్యాచ్‌ను ముగించారు.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 299/5 తో నిలిచిన ఆస్ట్రేలియాను భారత బౌలిర్లు ఆ తర్వాత రోజు 261 పరుగులకే కుప్పకూల్చారు. దాంతో.. భారత్‌ ముందు 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది కంగారుల జట్టు. తేలికైన లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌.. తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బను చూసింది. కిగ్‌ గ్రాత్‌ బౌలింగ్‌లో షపాలీ వర్మ (4) పరుగులకే ఔట్‌ అయ్యింది. దాంతో.. కాసేపు ఆచితూచి ఆడిన స్మృతి మందన్నా.. రిచా ఘోష్‌ రెండో వికెట్‌కు 50 పరుగులను జోడించారు. లంచ్‌ విరామం తర్వాత రిచానా ఔట్‌ అయ్యినా.. జెమీమాతో కలిసి స్మృతి మందన్నా (38 నాటౌట్‌)గా నిలిచా లాంచణాన్ని ముగించింది. దాంతో.. భారత్‌ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. అయితే.. ఆస్ట్రేలియాతో టెస్టుకు ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ భారత అమ్మాయిలు విజయం సాధించారు.

కాగా.. డిసెంబర్ 21న వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా, భారత్‌ మహిళా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం అయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్లలో పుజా వస్త్రాకర్‌ 4 వికెట్లు తీయగా.. స్నేహ్‌ రాణా 3 వికెట్లు ,దీప్తి శర్మ రెండు వికెట్లు తీసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. దాంతో.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 406 పరుగులు చేసింది. అయితే.. టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టుపై భారత మహిళా జట్టుకు ఇదే పెద్ద స్కోరు. తొలి ఇన్నింగ్స్‌ తర్వాత భారత్‌కు 187 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మహిళా బ్యాటర్లు కాస్త మెరుగ్గానే ఆడారు. 261 పరుగులకు ఆలౌట్‌ అయ్యారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 4 వికెట్లు తీయగా.. గైక్వాడ్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. పూజా వస్త్రాకర్‌కు ఒక వికెట్ దక్కింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళా జట్టు రెండు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో చేధించింది. తద్వారా ఆస్ట్రేలియాపై టెస్టుల్లో భారత మహిళా జట్టు రికార్డు గెలుపును నమోదు చేసింది.


Next Story