పాక్ కెప్టెన్ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది..!

పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా.. అభిషేక్ శర్మను పాక్‌పై ఆడించాలని కోరుకుంటే.. అతని కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.

By -  Medi Samrat
Published on : 14 Feb 2026 8:30 PM IST

పాక్ కెప్టెన్ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది..!

పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా.. అభిషేక్ శర్మను పాక్‌పై ఆడించాలని కోరుకుంటే.. అతని కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. మేము అభిషేక్‌ను ఆడిస్తామన్నాడు. ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ జరగనుంది. కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌కు అభిషేక్ శర్మ దూరమయ్యాడు. అలాగే ఆసుపత్రి పాలయ్యాడు.

కానీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, అభిషేక్ భారత జట్టుతో కొలంబో చేరుకున్నాడు. భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ పాకిస్థాన్‌తో ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని, ప్లేయింగ్ ఎలెవన్‌లో తిరిగి వస్తున్నాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.

భారత్‌తో మ్యాచ్‌కు ఒక రోజు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ, అభిషేక్ శర్మను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని అన్నారు. "రేపు అతను ఆడాలని మేము కోరుకుంటున్నాము. అతనికి వ్యతిరేకంగా మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాము" అని అతను అన్నాడు. సల్మాన్ వ్యాఖ్య‌ల‌కు సూర్య కూడా చాలా స్పష్టంగా సమాధానమిచ్చాడు.

రేపటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మను ఆడించాలని సల్మాన్ కోరుకుంటే.. మేము ఖచ్చితంగా అతనిని ఆడిస్తామని సూర్యకుమార్ యాదవ్ అన్నారు. కొలంబో చేరుకున్న తర్వాత అభిషేక్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడవచ్చు. అతని తల్లిదండ్రులు కూడా కొలంబోకు చేరుకున్నారు.

2026 T20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు భారత బ్యాటింగ్ ఇబ్బందికరంగా ఉంది. రెండు విజయాలు సాధించినప్పటికీ.. భారత మిడిల్ ఆర్డర్ USA, నమీబియా రెండింటిపైనా ఇబ్బంది పడింది. సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడారు. సూర్య మాట్లాడుతూ.. మాకు కష్టకాలం ప్రారంభమైంది.. కానీ ఆ వాస్తవాన్ని మేము విస్మరించలేము.. ఎటువంటి సాకులు ఉండవు.. అందరూ చాలా క్రికెట్ ఆడారు.. బ్యాట్స్‌మెన్ కష్టతరమైన వికెట్లపై వ్యూహరచన చేయాలి.. మేము బాగా ప్రారంభించాము కానీ కొంచెం తడబడ్డాము.. కానీ మేము బాగానే ఉన్నాం.. అదే T20 క్రికెట్ అందం అని అన్నాడు.

Next Story