ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఈడెన్ గార్డెన్స్‌కు ద్రావిడ్..ఎందుకంటే..?
Why Rahul Dravid Rushed To Eden Gardens From Airport.న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను
By తోట వంశీ కుమార్ Published on 21 Nov 2021 10:53 AM GMTన్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆఖరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరిస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని టీమ్ఇండియా బావిస్తుండగా.. కనీసం ఈ మ్యాచ్‌నైనా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని కివీస్ ఆరాటపడుతోంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన నేపథ్యంలో భారత జట్టు ఇప్పటి వరకు అవకాశం దక్కని ఆటగాళ్లు ఆడించొచ్చు.
ఇదిలా ఉంటే.. రాంచీలో రెండో టీ20 ముగిసిన అనంతరం టీమ్ఇండియా శనివారం కోల్‌కతా చేరుకుంది. జట్టు మొత్తం హోటల్ రూమ్‌కు వెళ్లగా.. టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో కలిసి ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్ మైదానానికి వెళ్లారు. బ్యాటింగ్ కోచ్‌తో కలిసి పిచ్‌ను పరిశీలించిన ద్రావిడ్ అక్కడి పిచ్ క్యూరేటర్‌తో చాలా సేపు మాట్లాడాడు.
ద్రావిడ్ అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే..
ఇటీవలి కాలంలో ఈడెన్ గార్డెన్స్ ఎక్కువ మ్యాచ్‌లకు అతిథ్యం ఇవ్వలేదు. దీంతో పిచ్ పరిస్థితి ఎలా ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్ది పిచ్ ఎలా స్పందిస్తుంది అని తెలుసుకునేందుకు ద్రావిడ్ నేరుగా వెళ్లాడు. పిచ్‌పై ఓ అంచనాకు వచ్చిన తరువాత తుది జట్టు కూర్పులో మార్పు చేర్పుల విషయంలో అతడు ఓ నిర్ణయం తీసుకోనున్నాడని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈడెన్ గార్డెన్‌తో ద్రావిడ్‌కు మంచి అనుబంధం ఉంది. 2001 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లక్ష్మణ్(281)తో కలిసి ద్రావిడ్(180) ఐదో వికెట్‌కు 376 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ భారత క్రికెట్ గతినే మార్చేసింది అని చెప్పవచ్చు.