డారెన్ సమీ 'కిరీటం' ఎందుకు ధరించాడు?
Why does cricketer Darren Sammy wear the crown?. పూర్వ వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ డారెన్ సమీకి భారత్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. భారత్‌లో ఆయనకు
By అంజి
పూర్వ వెస్టిండీస్ క్రికెట్ జట్టు కెప్టెన్ డారెన్ సమీకి భారత్ అంటే ప్రత్యేక అభిమానం ఉంది. భారత్‌లో ఆయనకు అశేష అభిమానులున్నారు. అతను భారత్‌లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ను తన కెప్టెన్సీలో సాధించాడు. అంతేకాదు తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను కూడా అతను భారత్‌లోనే ఆడాడు. 2021లో ఓ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహారించాడు. దీంతో ఆసక్తికరమైన క్యాంపెయిన్స్ అతని ముఖచిత్ంతో ప్రారంభం కావానికి కారణం అయ్యాయి. స్పోర్ట్స్‌ను వేడుక చేసే ఎన్నో కంపెనీలతో పార్టనర్‌షిప్ చేసుకున్న డారెన్, క్రికెట్‌తో తనకున్న అటాచ్‌మెంట్‌ను మాత్రం ఎన్నో రకాలుగా కొనసాగించాడు.
క్రికెట్‌లో భారీ సిక్సర్లు సంధించడం, మనసులో ఏం అనుకుంటే.. అది నిర్మోహమాటంగా చెప్పడం డారెన్ స్వభావం. ఇదే అతడికి గుర్తింపును తెచ్చింది. అయితే ఇప్పుడు డారెన్ సమీ భారతీయునిలా కనిపించబోతున్నాడు. అతని గురించి ఇప్పుడు ఆసక్తికరమైన ఫొటో కనిపిస్తోంది. అతను ఇప్పుడు కిరీటం ధరించి మహరాజులా, మొహంలో చిరునవ్వు పులుముకుని కనిపిస్తున్నాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు భిన్నరకాలుగా నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.
సెయింట్ లూసియా దీవుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన తొలి ఆటగానిగా డారెన్ ఖ్యాతి గడించాడు. వైవిధ్యమైన వ్యక్తిగా డారెన్ మనకు సుపరిచితులు. అతడు మరో కొత్త గేమ్‌ప్లాన్‌తో వస్తే ఏ మాత్రం ఆశ్చర్య పోనవసరం లేదు. కాకపోతే అతను కిరీటం ఎందుకు ధరించాడనే ఆసక్తి మాత్రం అందరిలో ఉంది. డారెన్ చాలా సందర్భాల్లో భారత్ తనకు రెండో ఇల్లు వంటిదని చెప్పాడు. అయితే అతడు ఇక్కడ ఏమైనా సెకండ్ కెరీర్ ఇన్నింగ్స్ కోసం ప్లాన్ చేస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.