టీ20 కెప్టెన్ గా విరాట్ వైదొలగబోతున్నాడు.. మరి నెక్ట్స్ ఎవరు..?
Who Will Replace Virat Kohli As India's T20 Captain.విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్
By M.S.R
విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను టీ20 కెప్టెన్ గా కొనసాగబోనని విరాట్ కోహ్లీ కీలక ప్రకటన చేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక లెటర్ ను ఉంచాడు. తాను ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఇకపై కాస్త తగ్గించడానికి టీ20 కెప్టెన్ గా తప్పుకున్నానని తెలిపాడు. ఈ విషయం గురించి కోచ్ రవి శాస్త్రితోనూ, రోహిత్ శర్మతోనూ చర్చించానని కూడా కోహ్లీ తెలిపాడు. అక్టోబర్‌లో యూఏఈ, ఒమన్ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్ విరాట్ కోహ్లీకి టీ20 కెప్టెన్‌గా ఆఖరి టోర్నమెంట్ అని తెలుస్తోంది. ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా కొనసాగుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు టీ20ల్లో సారథ్య బాధ్యతలు అప్పగించనున్నారనే ప్రచారం సాగుతోంది.
కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ టి20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 34 ఏళ్లు. ఫిట్‌నెస్ దృష్యా రోహిత్ మహా అయితే ఇంకో రెండు మూడేళ్లు క్రికెట్ ఆడే అవకాశం ఉంది. ఇప్పుడు టి20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్న రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మను టీ20, వన్డే కెప్టెన్ గా నియమించాలని ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఇక రోహిత్ తర్వాత కేఎల్ రాహుల్, శ్రెయాస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి యువ ఆటగాళ్లు పరిమిత, టి20ల్లో కెప్టెన్‌గా రాణిస్తారని అన్నారు.