భారత జట్టు పాక్‌కు ఎందుకు వెళ్లడం లేదు.? అసలు కారణాన్ని ఐసీసీకి తెలిపిన‌ బీసీసీఐ

వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ టోర్నీ పాకిస్థాన్‌లో జరుగుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు

By Medi Samrat  Published on  15 Nov 2024 7:00 PM IST
భారత జట్టు పాక్‌కు ఎందుకు వెళ్లడం లేదు.? అసలు కారణాన్ని ఐసీసీకి తెలిపిన‌ బీసీసీఐ

వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ టోర్నీ పాకిస్థాన్‌లో జరుగుతుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య బాధ్యతలను పాకిస్థాన్‌కు అప్పగించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించబోదని బీసీసీఐ ఐసీసీకి స్పష్టం చేసింది.

రాజకీయ ఉద్రిక్తత కారణంగా భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ఆడడం లేదు. రెండు దేశాలు ICC, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈవెంట్లలో మాత్రమే ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. భారత జట్టు చివరిసారిగా 2006లో పాకిస్థాన్‌లో పర్యటించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు పాక్‌కు వెళ్లదు. అయితే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో ఆడేందుకు బీసీసీఐ సిద్ధమైంది. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన వైఖరిని అవలంబించింది. టోర్నీని 'హైబ్రిడ్ మోడల్'లో నిర్వహించేందుకు పీసీబీ సిద్ధంగా లేదు. టోర్నీ మొత్తం పాకిస్థాన్‌లోనే జరుగుతుందని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ స్పష్టం చేశారు. భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో ఎందుకు పర్యటించడం లేదని పీసీబీ.. ఐసీసీ నుంచి సమాధానాలు కోరింది.

స్పోర్ట్స్ టాక్ నివేదిక ప్రకారం.. BCCI సమాధానంలో భారత క్రికెట్ జట్టులోని ఆటగాళ్ల భద్రతపై భయం గురించి బలంగా ప్రస్తావించబడింది. బీసీసీఐ ఐసీసీకి పంపిన‌ సమాధానంలో.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద ఘటనల ప్రస్తావన ఉన్న ఫైల్ కూడా ఉంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇందులో ప్రస్తావించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు భారత ఆటగాళ్లే లక్ష్యంగా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. భారత క్రికెట్ జట్టు అభిమానుల నుంచి విపరీతమైన ప్రేమను పొందుతున్నప్పటికీ, ఉగ్రవాదులు భారత క్రికెట్ జట్టును టార్గెట్ చేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. 2009లో పాకిస్థాన్‌లో శ్రీలంక జట్టుపై దాడి జరిగిందని ఉదహరించినట్లు తెలుస్తుంది.

ICCకి అందుబాటులో ఉన్న ఎంపికలు ఏమిటి.?

పీసీబీ, బీసీసీఐ తమ నిర్ణయంపై మొండిగా ఉన్నాయి. సమస్యను పరిష్కరించే బాధ్యత ఐసీసీ భుజస్కంధాలపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీకి మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని నిరవధికంగా వాయిదా వేయాలి. ఈ నిర్ణయం ఐసీసీ, పీసీబీలకు భారీ నష్టాన్ని కలిగించనుంది. బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంగీకరించాలి. అటువంటి పరిస్థితిలో టోర్నమెంట్‌లోని 15 మ్యాచ్‌లలో ఐదు యుఎఇలో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ నుంచి పూర్తిగా తొలగించాలి. ఈ నిర్ణయం టోర్నమెంట్ నుండి తన జట్టు భాగస్వామ్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకునేలా PCBని బలవంతం చేయవచ్చు.

Next Story