కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొడుతున్నారు. 23 ఏళ్ల బింద్యారాణి దేవి 55 కిలోల విభాగంలో రజతం గెలుచుకుంది. క్లీన్ అండ్ జర్క్ రెండో ప్రయత్నంలో 114 కిలోలు ఎత్తడంలో బింద్యా రాణి విఫలమైంది. అయితే చివరి రౌండ్‌లో పుంజుకున్న బింద్యారాణి 116 కిలోలు ఎత్తి రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నది. నైజీరియా క్రీడాకారిణి అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి స్వర్ణ పతకాన్ని సాధించింది. స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జెర్క్‌లో 116 మొత్తం 202 కేజీల స్కోర్ చేసింది బింద్యారాణి.
బింద్యారాణి పతకం సాధించడంతో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మెడల్స్ సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నాలుగు కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లోనే రావడం విశేషం. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణం, పురుషుల 55 కేజీల్లో సుంకేత్ రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్యం నెగ్గారు.