టీమ్ఇండియా ఓట‌మిని ఎగ‌తాళి చేసిన వాన్‌.. దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన వ‌సీం

Wasim Jaffer counter to Michael Vaughan tweet.ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు మైఖేల్ వాన్‌కు భారత మాజీ ఆట‌గాడు వ‌సీం జాప‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 March 2021 10:29 AM GMT
టీమ్ఇండియా ఓట‌మిని ఎగ‌తాళి చేసిన వాన్‌.. దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన వ‌సీం

ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు మైఖేల్ వాన్‌కు భారత మాజీ ఆట‌గాడు వ‌సీం జాప‌ర్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చాడు. న‌రేంద్ర మోదీ స్టేడియంలో శుక్ర‌వారం భార‌త్‌-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన‌ తొలి టీ20లో ఇంగ్లాండ్ జ‌ట్టు 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. దీంతో 5 టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. భార‌త ఓట‌మిని ఎగ‌తాళి చేస్తూ మైఖేల్ వాన్ వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త టీ20 జ‌ట్టు కంటే ఐపీఎల్‌లోని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టే న‌యం అని అనిపిస్తుంద‌ని సెటైర్లు వేశాడు. మైఖేల్ వాన్ చేసిన వ్యాఖ్య‌లు భార‌త అభిమానుల‌తో పాటు వ‌సీం జాఫ‌ర్‌కు తీవ్ర ఆగ్ర‌హాం తెప్పించింది.

ఇందుకు వ‌సీం జాఫ‌ర్ కూడా గ‌ట్టిగానే బ‌దులు ఇచ్చాడు. 'నలుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించే అదృష్టం అన్ని జట్లకు ఉండదు కదా మైఖేల్‌'' అంటూ వసీం చమత్కరించాడు. ఇంగ్లాండ్ జ‌ట్టులోని ఇత‌ర దేశాల ఆట‌గాళ్ల‌ను ప‌రోక్షంగా ఉద్దేశిస్తూ వ‌సీం ఈ వ్యాఖ్య‌లు చేశాడు. వ‌సీం స‌మ‌య‌స్పూర్తిని నెటీజ‌న్లు కొనియాడుతున్నారు. టెస్టు సిరీస్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఏదో ఒక ర‌కంగా మైకేల్ వాన్ వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా మూడో టెస్టులో భారత్‌ విజయం సాధించడం పట్ల మొతేరా పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల గుప్పించిన వాన్.. భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.

వరుస ట్వీట్లతో పిచ్‌పై, భారత్‌పై తనకున్న అక్కసును వెళ్లగక్కాడు. చివరకు భారత అద్భుత ప్రదర్శనకు తలవంచుతూ కోహ్లీసేనపై ప్రశంసలు కురిపించాడు. తాజాగా తొలి టీ20లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించడంతో.. మరోసారి భారత్‌పై తన విద్వేశాన్ని వెళ్లగక్కాడు. ఇక ఇంగ్లాండ్‌‌ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.


Next Story
Share it