సెలెక్టర్లపై విరుచుకుప‌డ్డ టీమిండియా క్రికెట‌ర్ తండ్రి

వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎం.సుందర్ భారత సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

By Medi Samrat
Published on : 28 July 2025 9:15 PM IST

సెలెక్టర్లపై విరుచుకుప‌డ్డ టీమిండియా క్రికెట‌ర్ తండ్రి

వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎం.సుందర్ భారత సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కొడుకుకు జాతీయ జట్టులో స్థిరమైన అవకాశాలు ఇవ్వకపోవడం పై తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో వాషింగ్టన్ వీరోచిత ప్రదర్శన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆల్ రౌండర్ తన తొలి టెస్ట్ సెంచరీ సాధించి మ్యాచ్ డ్రా అవ్వడానికి కారణం అయ్యాడు.

వాషింగ్టన్ చాలా బాగా రాణిస్తున్నాడు. ఇతర ఆటగాళ్లకు క్రమం తప్పకుండా అవకాశాలు లభిస్తాయి, నా కొడుకుకు మాత్రమే దక్కడం లేదని ఎం. సుందర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో అన్నారు. నాల్గవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్‌లో చేసినట్లుగానే వాషింగ్టన్ స్థిరంగా ఐదవ స్థానంలో బ్యాటింగ్ చేయాలి. వరుసగా ఐదు నుండి పది అవకాశాలు పొందాలి. ఆశ్చర్యకరంగా నా కొడుకు ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌కు ఎంపిక కాలేదు. సెలెక్టర్లు అతని ప్రదర్శనలను గమనించాలి" అని ఆయన అన్నారు. 2021లో టెస్ట్ అరంగేట్రం చేసిన వాషింగ్టన్, కేవలం 11 టెస్ట్ మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. అయినప్పటికీ, అతను 44.86 బ్యాటింగ్ సగటు, 27.87 బౌలింగ్ సగటును కలిగి ఉన్నాడు.

Next Story