వన్డే సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు షాక్
Washington Sundar tests positive for COVID-19.దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది
By తోట వంశీ కుమార్ Published on 11 Jan 2022 11:22 AM GMTదక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. వన్డే సిరీస్‌కు ఎంపికైనా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కరోనా బారిన పడ్డాడు. దీంతో ఈ ఆల్‌రౌండర్ వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది అనుమానంగా మారింది. ప్రొటీస్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన భారత క్రికెట్ సభ్యులందరూ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో శిక్షణ పొందున్నారు. అక్కడి నుంచి ముంబై వెళ్లి.. ప్రత్యేక చార్టెట్ విమానంలో బుధవారం సౌతాఫ్రికా వెళ్లనున్నారు.
ఈ క్రమంలో ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. సుందర్‌కి పాజిటివ్‌గా తేలింది. ఇంగ్లాండ్ టూర్‌లో కౌంటీ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన వాషింగ్టన్ సుందర్, దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని తమిళనాడు తరుపున విజయ్ హాజారే ట్రోఫీ 2021లో పాల్గొని సత్తా చాటాడు. అదే ఫామ్‌ను సఫారీ పర్యటనలో కొనసాగించాలని ఆశించగా.. కరోనా బారిన పడ్డాడు. అయితే.. వైరస్ నుంచి కోలుకున్న తరువాత సుందర్ దక్షిణాఫ్రికాకు వెళ్తాడా..? లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఈ నెల 19 నుంచి వన్డే సిరీస్ ఆరంభంకానుంది. మొత్తం మూడు వన్డేలు టీమ్ఇండియా ఆడనుంది.
ఇక గాయం కారణంగా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే సౌతాఫ్రికా పర్యటనకు దూరం కాగా.. వన్డేల్లో కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నాడు.