ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైన వాషింగ్టన్ సుందర్.. మహిళల జట్టు నుంచి కూడా ఇద్ద‌రు..!

భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జింబాబ్వే, శ్రీలంక పర్యటనల్లో తన అద్భుత‌ ప్రదర్శనతో లాభపడ్డాడు.

By Medi Samrat  Published on  6 Aug 2024 1:55 PM IST
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైన వాషింగ్టన్ సుందర్.. మహిళల జట్టు నుంచి కూడా ఇద్ద‌రు..!

భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ జింబాబ్వే, శ్రీలంక పర్యటనల్లో తన అద్భుత‌ ప్రదర్శనతో లాభపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అతడిని జూలై నెలలో ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక చేసింది. మహిళల జట్టు నుంచి స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వీరిద్దరూ ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన మహిళల ఆసియా కప్‌లో తమదైన ముద్ర వేశారు.

కొంతకాలంగా గాయాలతో పోరాడిన సుందర్ తిరిగి పునరాగమనం చేయగలిగాడు. తన అద్భుత‌ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటించిన యువ భారత జట్టులో సుందర్ సభ్యుడు. 24 ఏళ్ల త‌ర్వాత‌ టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా సీనియ‌ర్‌ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వ‌డంతో స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సుందర్‌తో పాటు ఫాస్ట్ బౌలర్లు గస్ అట్కిన్సన్, చార్లీ కాజిల్ కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నామినేట్ అయ్యారు.

మహిళల జట్టు నుంచి స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఎంపికయ్యారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మంధాన అత్యధిక పరుగులు చేసింది. దీంతో పాటు మహిళల ఆసియా కప్‌లోనూ ఆమె బ్యాట్‌తో విజృంభించింది. అదే సమయంలో షెఫాలీ వర్మ గత నెలలో శ్రీలంకలో జరిగిన టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. జులై అత్యుత్తమ ఆటగాళ్లుగా వీరిద్దరూ పేరు తెచ్చుకోవడానికి ఇదే కారణం. ఇది కాకుండా శ్రీలంకకు చెందిన‌ చమ్రీ అటపట్టు కూడా ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా నామినేట్ అయ్యింది.

Next Story