అసలే సన్ రైజర్స్ కు కలిసిరాని సీజన్.. ఇప్పుడేమో ఇలా

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతూ ఉంది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ లో సన్ రైజర్స్

By M.S.R  Published on  27 April 2023 6:30 PM IST
Washington Sundar,  IPL 2023, SunRisers Hyderabad

అసలే సన్ రైజర్స్ కు కలిసిరాని సీజన్.. ఇప్పుడేమో ఇలా

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస ఓటములతో సతమతమవుతూ ఉంది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్ లో సన్ రైజర్స్ పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. ఇక సన్ రైజర్స్ కు ఊహించని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. తొడకండరాల గాయం కారణంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2023 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్ ఢిల్లీతో మ్యాచ్‌లో బౌలింగులోను, ఇటు బ్యాటింగులోనూ రాణించి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. కానీ ఇప్పుడేమో అతడు సీజన్ మొత్తానికి దూరమవుతున్నాడనే వార్త హైదరాబాద్ ఫ్యాన్స్ కు షాకిస్తోంది. గాయం కారణంగా ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లకు సుందర్ దూరమయ్యాడని ఎస్.ఆర్. హెచ్. యాజమాన్యం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇప్పటి వరకు సుందర్ ఏడు మ్యాచ్‌లు ఆడి 60 పరుగులు చేశాడు. మూడు వికెట్లు తీసుకున్నాడు. సుందర్ స్థానంలో ఆల్ రౌండర్ కు ఛాన్స్ ఇస్తారా.. లేక ఇంకో స్పిన్నర్ కు అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Next Story