శృంగార జీవితంపై వార్నర్ భార్య బోల్డ్ కామెంట్స్
Warner Wife Bold Comments On Sexual life. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో
By Medi Samrat Published on 11 Nov 2020 6:58 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో సరిపెట్టుకుంది. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడినప్పటికీ వార్నర్ జట్టును క్వాలిపైయర్ వరకు తీసుకువచ్చిన తీరు అద్భుతం. వార్నర్ ఈ సీజన్ 16 మ్యాచ్‌ల్లో 548 పరుగులు చేశాడు. ఇక వార్నర్‌కు క్రికెట్‌తో పాటు తన కుటుంబానికి సమయం కేటాయిస్తాడు. అయితే.. సీజన్ ముగిసినా తన కుటుంబ సభ్యులతో వార్నర్ కలవటానికి వీలులేదు. స్వదేవానికి వెళ్లిన అతను.. అక్కడి నిబంధనల ప్రకారం మరో 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. వార్నర్ సతీమణి క్యాండిస్ తన శృంగార జీవితంపై బోల్డ్ కామెంట్స్ చేసింది. ఓ షోలో పాల్గొన్న ఆమెను హోస్ట్ లైంగిక జీవితంపై కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయరు. క్రికెటర్లు కూడా ఇలానే ఉంటారా? వార్నర్ తన మ్యాచ్‌కు ముందు సెక్స్ చేస్తాడా?'అని ప్రశ్నించాడు. దీనికి క్యాండిస్ సమాధాన మిస్తూ.. అది డేవిడ్ వార్నర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని.. అతడికి కావాలనుకుంటే చేస్తాడని.. లేకుంటే లేదని తెలిపింది. అలాంటి నిబంధనలు ఏవీ లేవని చెప్పింది. అంతేకాదండోయ్ తన భర్త ఆ విషయంలో చాలా సమర్థుడని సర్టిఫికేట్ కూడా ఇచ్చిందండోయ్.
మ్యాచ్ డే వరకు సెక్స్ చేయడానికి వార్నర్ సిద్దమైతే ఏం చేస్తారని ప్రశ్నించగా.. అతనికి కావాల్సింది చేస్తానని బదులిచ్చింది. 2015లో క్యాండిస్‌ను వార్నర్ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇవి(6ఏళ్లు), ఇండి(4 ఏళ్లు), ఇస్లా(15 నెలలు).