చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఇంట్లో విషాదం..
Viswanathan anand's father dies.భారత చెస్ దిగ్గజం, విశ్వానాథన్ ఆనంద్ తండ్రి కె.విశ్వనాథన్ గురువారం కన్నుమూశారు.
By తోట వంశీ కుమార్ Published on
15 April 2021 11:00 AM GMT

భారత చెస్ దిగ్గజం, మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వానాథన్ ఆనంద్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి కె.విశ్వనాథన్ గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. గతంలో ఆయన దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్‌గా పని చేశారు. విశ్వనాథన్‌కు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఓ కుమారై ఉన్నారు.
ఆనంద్ చెస్‌లో ఈ స్థాయికి చేరడంలో విశ్వనాథన్ పాత్ర ఎంతగానో ఉన్నట్లు ఆనంద్ సతీమణి అరుణ గుర్తు చేసుకున్నారు. ఆనంద్ సాధించిన అన్ని వరల్డ్ చాంపియన్‌షిప్ విజయాలను విశ్వనాథన్ చూశారని ఆమె తెలిపింది. ఒక సాధారణ వ్యక్తి తన పిల్లలకు ఉన్నతమైన విలువలు నేర్పారని కొనియాడారు. కుమారుడు సాధించిన విజయాలకు చూసి గర్వపడ్డారని, తుది శ్వాస వరకు గర్వించదగిన రైల్వే మ్యాన్‌గానే ఉన్నారంటూ ఆమె చెప్పారు.
Next Story