నేను ఆడుతా.. నన్ను ఆస్ట్రేలియాకు పంపించండని అంటున్న సెహ్వాగ్
Virender Sehwag Offers To Play In Brisbane Amid India's Injury Crisis. ఆస్ట్రేలియా సిరీస్ లో ఉన్న భారతజట్టుకు గాయాలు నేపత్యంలో నేను ఆడుతా అంటున్న సెహ్వాగ్.
By Medi Samrat Published on 13 Jan 2021 3:36 PM ISTఆస్ట్రేలియా సిరీస్ లో ఉన్న భారతజట్టును గాయాలు వెంటాడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! ఎంతో మంది ఆటగాళ్లు గాయాల బారిన పడి సిరీస్ నుండి తప్పుకోగా.. ఇప్పుడు భారత్ తుదిజట్టులో 11 మంది ఎవరు ఉంటారా అన్నది తెలియని పరిస్థితి. అందుకే నేను ఆసీస్ పర్యటనకు వెళ్ళడానికి రెడీగా ఉన్నానని భారత క్రికెట్ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆసీస్ సిరీస్‌లో టీమిండియా గాయాలతో సతమతమవడం నేను చూడలేకపోతున్నా. షమీ, ఉమేశ్, రాహుల్, జడేజా, విహారి, బుమ్రా ఇలా ఒకరి తర్వాత ఒకరు గాయపడడంతో సగం జట్టు ఖాళీ అయింది. ఒకవేళ 11 మందిలో ఇంకా ఎవరు ఫిట్‌గా లేకున్నా వారి స్థానంలో నేను ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని వీరూ ప్రకటించాడు. ఇప్పుడే ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కేందుకు నేను సిద్దం.. కానీ బీసీసీఐ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందేమోనని వీరూ ట్వీట్ చేశాడు.
Itne sab players injured hain , 11 na ho rahe hon toh Australia jaane ko taiyaar hoon, quarantine dekh lenge @BCCI pic.twitter.com/WPTONwUbvj
— Virender Sehwag (@virendersehwag) January 12, 2021
ప్రధాన బౌలర్ బుమ్రా, మయాంక్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో ఆడడం అనుమానమే. పృథ్వీషాకు తర్వాతి మ్యాచ్ లో భారత్ మరో అవకాశం ఇవ్వనుంది. కుల్ దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ ను టెస్ట్ మ్యాచ్ ఆడించాల్సి వచ్చింది. రెండు టెస్ట్ మ్యాచ్ ల అనుభవం మాత్రమే ఉన్న సిరాజ్ పేస్ బౌలింగ్ కు సారథ్యం వహించాల్సి వస్తోంది. ఒకే మ్యాచ్ అనుభవమున్న సైనీ అతడికి తోడుగా ఉండనున్నాడు. మూడో పేస్ బౌలర్ కావాలంటే నటరాజన్ కు తప్పకుండా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కీలకమైన టెస్ట్ సిరీస్ లో మూడు మ్యాచ్ లు ముగియగా, చెరో మ్యాచ్ ని రెండు జట్లూ గెలుచుకుని, ఒక మ్యాచ్ ని డ్రాగా ముగించాయి. దీంతో 1-1 తో ప్రస్తుతానికి సిరీస్ సమంగా ఉంది. ఇక నాలుగో మ్యాచ్ 15వ తేదీన బ్రిస్బేన్ లో జరుగనుంది.