విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రాకూడదు: వీరేంద్ర సెహ్వాగ్
విరాట్ అద్భుత ఫామ్‌తో పరుగులు సాధిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.
By Srikanth Gundamalla Published on 29 April 2024 11:17 AM IST
విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రాకూడదు: వీరేంద్ర సెహ్వాగ్
ఐపీఎల్ సీజన్-2024 అట్టహాసంగా కొనసాగుతోంది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లను చూస్తూ క్రికెట్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా కొందరు ఫ్యాన్స్ అయితే స్టేడియాలకు వెళ్లి తమ ఫేవరెట్ టీమ్‌లకు సపోర్ట్ చేస్తూ కిక్ పొందుతున్నారు. కాగా.. ఐపీఎల్‌లో బాగా ఫ్యాన్ బేస్ ఉన్న టీముల్లో ఒకటి ఆర్‌సీబీ. విరాట్ కోహ్లీ కోసం చాలా మంది ఈ టీమ్‌కు అభిమానులుగా మారారు. ఇక విరాట్ కోహ్లీ ఎప్పటిలానే ఈసారి కూడా ఐపీఎల్‌లో దూసుకుపోతున్నాడు. అద్భుత ఫామ్‌తో పరుగులు సాధిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు.
కాగా.. త్వరలోనే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఓపెనర్‌గా రావాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు క్రీడా నిపుణులు కూడా దీనిపై చర్చలు జరుపుతున్నారు. ఈ టాపిక్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా రాకూడదని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. విరాట్ మూడోస్థానంలో వస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఓపెనర్లు అందించిన దూకుడుని మిడ్ ఓవర్లలోనూ కొనసాగించాలి.. కాబట్టి విరాట్ కోహ్లీ మూడో స్థానంలో రావాలని అన్నాడు. 2007 వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ నాలుగో స్థానంలో ఆడిన విషయాన్ని ఈ సందర్భంగా సెహ్వాగ్ గుర్తు చేశాడు. సచిన్ అప్పట్లో ఓపెనర్ స్థానం వదులుకుని నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడని చెప్పాడు. సచిన్ కూడా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం ఇష్టం లేదు కానీ.. టీమ్ కోసం సిద్దమయ్యాడు అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. టీమిండియాలో మంచి ఓపెనర్లు ఉన్నప్పుడు మూడోస్థానంలో ఆడటం తప్పుకాదని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఆడేందుకు అభ్యంతరం చెప్పడనే అనుకుంటున్నానని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.