ఆసియా కప్‌ కోసం కోహ్లీ కొత్త లుక్‌.. మీరు చూశారా?

ఆసియా కప్‌-2023 కోసం విరాట్‌ కోహ్లీ కొత్త లుక్‌తో రెడీ అవుతున్నాడు.

By Srikanth Gundamalla  Published on  28 Aug 2023 1:48 PM IST
Virat, New Look, Asia Cup-2023, Cricket,

ఆసియా కప్‌ కోసం కోహ్లీ కొత్త లుక్‌.. మీరు చూశారా?

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ పరిచయం అవసరం లేని పేరు. అతడు రికార్డులకు కేరాఫ్ అడ్రస్. రన్‌ మెషిన్ అని పిలుస్తారు అభిమానులు. అయితే.. విరాట్‌ కోహ్లీ ఇప్పుడు ఆసియా కప్‌కు సిద్ధం అవుతున్నాడు. రెండ్రోజుల్లోనే ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టీమిండియాలో విరాట్‌పై అందరి దృష్టి ఉంది. విరాట్‌ కోహ్లీ బ్యాట్‌తో మైదానంలోకి వచ్చాడంటే.. అతడిపైనే ఉంటాయి అందరి చూపులు. అయితే.. విరాట్‌ కోహ్లీ ఆటలోనే కాదు.. లుక్స్‌కి కూడా చాలా ఇంపార్టెన్స్‌ ఇస్తారు. ఆసియా కప్‌కు కొత్త లుక్‌తో రెడీ అవుతున్నాడు.

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ (Asia Cup 2023) మరో రెండు రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో.. టీమిండియా రన్‌మెషీన్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కొత్త హెయిర్‌ కట్‌తో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు విరాట్‌ ఫొటోలను చూసి సూపర్బ్ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. మీకు సాటెవ్వరూ లేరంటూ తెగ పొగిడేస్తున్నారు. కోహ్లీ న్యూ లుక్‌ అదిరిపోయిందంటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఆసియా కప్‌ ఈసారి హైబ్రిడ్‌ మోడల్‌లో జరగనుంది. ఆగస్టు 30న మొదలు కానుంది. ఈ ట్రోనీకి పాకిస్థాన్, శ్రీలంక అతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. గత చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక మరోసారి కప్‌ను సొంతం చేసుకోవాలని బరిలోకి దిగుతోంది. మరోవైపు భారత్, పాకిస్థాన్‌ కూడా ఈ టోర్నీ కప్‌ విజయం సాధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి ఆసియా కప్‌ ఎవరు సాధిస్తారో అని ఉత్కంఠ నెలకొంది.

Next Story