తలపాగాతో కలిపించిన కోహ్లీ.. ఫోటో వైర‌ల్‌

Virat Kohli spotted in turban look.భారత క్రికెట్ జట్టు మాకీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నల్లటి తలపాగా, తెలుపు చొక్కా, లేత

By M.S.R  Published on  24 Feb 2022 5:11 AM GMT
తలపాగాతో కలిపించిన కోహ్లీ.. ఫోటో వైర‌ల్‌

భారత క్రికెట్ జట్టు మాకీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. నల్లటి తలపాగా, తెలుపు చొక్కా, లేత గోధుమరంగు రంగు ప్యాంటు ధరించి కనిపించాడు. బాలీవుడ్ స్టార్ అనుష్క లేత గులాబీ రంగు కాటన్ కుర్తా ధరించి, మాస్క్ తో సందడి చేసింది. ఇలాంటి లుక్ లో కోహ్లీ ఎందుకు కనిపించాడా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఇది ఒక యాడ్ షూటింగ్ లో భాగమై ఉంటుందని భావిస్తున్నారు. విరుష్క జంట కలిసి ఇప్పటికే పలు ప్రకటనలలో నటించారు. అభిమానులు వారి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని ఇష్టపడ్డారు. ఓ యాడ్ షూట్ లో కలిసిన తర్వాతనే కోహ్లీ, అనుష్క మధ్య ప్రేమ చిగురించిందనే విషయం తెలిసిందే..!

షాంపూ యాడ్ షూట్ సమయంలో వారు ప్రేమలో పడ్డారు. అక్కడే వారు మొదటిసారి కలుసుకున్నారు. ఇద్దరూ 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో మొదటి బిడ్డ వామిక పుట్టింది. అనుష్క శర్మ భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితం నుండి ప్రేరణ పొందిన 'చక్దా ఎక్స్‌ప్రెస్' చిత్రంలో నటిస్తోంది. విరాట్ చివరిసారిగా వెస్టిండీస్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో T-20 సిరీస్‌లో ఆడాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ నుండి వైదొలుగుతూ బయో బబుల్ నుండి బయటకు వచ్చాడు.

Next Story
Share it