కోహ్లీ బలంగా చైర్ ను త‌న్నేశాడు.. రిఫ‌రీ ఏం చేశాడంటే..?

Virat Kohli Smashes A Chair In Frustration.కోహ్లీ కోపానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2021 9:15 AM GMT
Virat Kohli

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని మ్యాచ్ రిఫరీ మందలించాడు. విరాట్ కోహ్లీ అసహనంతో అడ్వర్టయిజ్ మెంట్ కుషన్ ను, అక్కడే ఉన్న కుర్చీని కాలితో తన్నడం రిఫరీ కంట్లో పడింది. దీంతో మందలింపుకు గురయ్యాడు. సాధారణంగా మైదానంలో దూకుడుగా కనిపించే విరాట్ కోహ్లీ.. తాను అవుట్ అవ్వడంతో అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉండడం చాలా సహజమే.. కానీ ఇలా చైర్ ను తన్నడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కోహ్లీ కోపానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ తో చెన్నైలో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీకి మంచి ఆరంభం లభించింది. 29 బంతుల్లో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. హోల్డర్ బౌలింగ్ లో విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తన జట్టు స్కోరు వేగం పెంచాలన్న ఉద్దేశంతో 12వ ఓవర్ ఒకటో బంతికి భారీ షాట్ ను ఆడిన కోహ్లీ, లాంగ్ లెగ్ లో ఉన్న విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో కోపంతో పెవిలియన్ కు వెళ్ళిపోయాడు కోహ్లీ. కోహ్లీ అడ్వర్టయిజ్ మెంట్ కుషన్ ను, అక్కడే ఉన్న కుర్చీని కాలితో తన్నుతూ తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఈ ఘటనపై లెవల్ 1 అభియోగాలను నమోదు చేసిన రిఫరీ వెంగలిల్ నారాయణ్ కుట్టి, కోహ్లీని మందలింపుతో సరిపెట్టాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే..!


Next Story
Share it