రింకూ సింగ్‌కు విరాట్ కోహ్లీ భావోద్వేగ సందేశం

టీమ్ ఇండియా యువ సంచలనం రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

By -  Medi Samrat
Published on : 27 Feb 2026 5:10 PM IST

రింకూ సింగ్‌కు విరాట్ కోహ్లీ భావోద్వేగ సందేశం

టీమ్ ఇండియా యువ సంచలనం రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గత కొద్ది రోజులుగా ఖాన్‌చంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించారు. తండ్రి ఆరోగ్యం బాగోలేదన్న వార్త తెలియగానే, చెన్నైలో జింబాబ్వేతో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచ్‌కు ముందు రింకూ సింగ్ క్యాంప్ నుండి బయటకు వెళ్లారు.

రింకూ తండ్రిని కోల్పోవడంపై విరాట్ కోహ్లీ ఎక్స్ వేదికగా స్పందించాడు. "రింకూ తండ్రి మరణవార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ కష్టకాలంలో నా ప్రార్థనలు నీకు, నీ కుటుంబానికి ఉంటాయి. ఆయన ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి. ఓం శాంతి" అని కోహ్లీ పోస్ట్ చేశాడు.

Next Story