'పుష్ప' ప్రమోషన్స్ మొదలెట్టేసిన డేవిడ్ వార్నర్

Virat Kohli reacts as David Warner swaps faces with Allu Arjun. అల వైకుంఠపురం సినిమాలోని 'బుట్టబొమ్మ' పాట అంతగా ఫేమస్ అయ్యింది అంటే

By Medi Samrat  Published on  12 Dec 2021 1:19 PM GMT
పుష్ప ప్రమోషన్స్ మొదలెట్టేసిన డేవిడ్ వార్నర్

అల వైకుంఠపురం సినిమాలోని 'బుట్టబొమ్మ' పాట అంతగా ఫేమస్ అయ్యింది అంటే.. అందుకు కారణం డేవిడ్ వార్నర్ అన్న సంగతి తెలిసిందే..! ఇక అల్లు అర్జున్ తర్వాతి సినిమా 'పుష్ప' ఈ వారంలో విడుదల కాబోతోంది. అందుకు సంబంధించి ప్రమోషన్స్ పెద్దగా జరగడం లేదని అల్లు అర్జున్ అభిమానులు ఓ వైపు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో డేవిడ్ వార్నర్ 'పుష్ప' ప్రమోషన్స్ ను తన భుజాల మీద వేసుకున్నాడు. అల్లు అర్జున్ 'పుష్ప' కు సంబంధించి మార్ఫింగ్ వీడియోను పోస్ట్ ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశాడు డేవిడ్ వార్నర్. "Caption this!! #actor #who #lovethis," అంటూ పుష్ప సినిమాకు సంబంధించిన పోస్టు పెట్టాడు. ఇక పుష్ప ప్రమోషన్స్ ఇంటర్నేషనల్ లెవల్ లో మొదలైనట్లేనని అల్లు అర్జున్ అభిమానులు భావిస్తూ ఉన్నారు.

వార్నర్ ఎడిట్ చేసిన వీడియోకు విరాట్ కోహ్లి కూడా ఫన్నీ రియాక్షన్ ఇచ్చాడు. "Mate are you ok?" అని కోహ్లి వ్యాఖ్యానించారు. వార్నర్ వెంటనే "@virat.kohli a little sore but I know you mean in my head, never alrigt." ఇలా బదులిచ్చాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయంలో 35 ఏళ్ల వార్నర్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ మొదటి మ్యాచ్ గబ్బాలో ఇంగ్లాండ్‌పై 94 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో అతడి పక్కటెముకకు గాయమైంది. ముందు జాగ్రత్త చర్యల కారణంగా ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. రెండో యాషెస్ టెస్టు డిసెంబర్ 16 నుంచి అడిలైడ్‌లో జరగనుంది.


Next Story
Share it