భారత జట్టులో ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ది 'గీత-సీత' స్నేహం.. ఒక‌రిని వ‌దిలి ఒక‌రు ఉండ‌లేరు : కోహ్లీ

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ జాతీయ జట్టులోని ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను గీత-సీత పేర్ల‌తో పోల్చాడు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లు భారత జట్టులోని సీత-గీత అని

By Medi Samrat  Published on  11 April 2024 1:15 PM GMT
భారత జట్టులో ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ది గీత-సీత స్నేహం.. ఒక‌రిని వ‌దిలి ఒక‌రు ఉండ‌లేరు : కోహ్లీ

భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ జాతీయ జట్టులోని ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌ను గీత-సీత పేర్ల‌తో పోల్చాడు. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్‌లు భారత జట్టులోని సీత-గీత క‌వ‌ల‌ల‌ని.. వారు ప్రతి పనిని కలిసి చేయడానికి ఇష్టపడతారని కోహ్లీ చెప్పాడు.

యువ ఆట‌గాళ్లు ఇషాన్ కిషన్, శుభ్‌మాన్ గిల్‌ల మధ్య మైదానం వెలుపల ఉన్న సంబంధం ప్రత్యేకమైనది. వారి సోదర ప్రేమ గురించి పరిచయం అవసరం లేదు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, డాషింగ్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌లు ఒకరితో స్నేహాన్ని ఒక‌రు చాలా ఇష్టపడతారు. ఇటీవలి కాలంలో వీరిద్దరూ భారత జట్టుకు వివిధ ఫార్మాట్లలో ఆడారు. భారత జట్టు సుదీర్ఘ పర్యటనలో ఉన్నప్పుడు గిల్-కిషన్ లు వారి సహవాసంతో ఎంజాయ్ చేస్తారు.

గిల్‌, కిషన్‌ల మధ్య ప్రేమానురాగాలను వివరిస్తూ.. ఇద్దరూ కవలలుగా కనిపిస్తున్నారని కోహ్లీ చెప్పాడు. డిన్నర్ టైమ్ అయినా, టీమ్ మీటింగ్ అయినా కిషన్-గిల్ ఒకరి సాహచర్యాన్ని ఒకరికొకరు ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి ఇద్దరినీ వేరు చేయడం కష్టమని కోహ్లీ చెప్పాడు. ఇద్దరూ కలిసి కనిపిస్తారని అన్నాడు.

సీత, గీత (ఇషాన్ మరియు శుభ్‌మాన్) చాలా ఫన్నీ. వారి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎక్కువ చెప్పలేం.. కానీ ఈ ఇద్దరూ టూర్‌లలో ఒంటరిగా ఉండలేరు. తినడానికి బయటికి వెళితే ఒక‌రి వెంట ఒక‌రు వస్తారు. వాళ్ళు ఏదో ఆలోచిస్తూ కూడా కలిసి కనిపిస్తారు. నేను వారిని ఒంటరిగా చూడలేదు. వారిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని పేర్కొన్నాడు.

అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఐపీఎల్ 2024లో బిజీగా ఉన్నారు. ఈ ముగ్గురు క్రికెటర్లు పటిష్ట ప్రదర్శన చేసి టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులో చోటు దక్కించుకోవాలనుకుంటున్నారు. కోహ్లి బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసి ఆరెంజ్ క్యాప్ ధరించగా..అత‌డి తర్వాత గిల్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఇషాన్ కిషన్ కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు.., అయితే అతడు కూడా మెరుగైన ప్రదర్శనను కొనసాగించాలని భావిస్తున్నారు అభిమానులు.

Next Story