CSK Vs RCB: కోహ్లీ ఏంటి ఇలా చేశాడంటోన్న అభిమానులు

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది.

By Srikanth Gundamalla  Published on  23 March 2024 5:31 AM GMT
virat kohli, ipl-2024, CSK,  RCB, chennai,

 CSK Vs RCB: కోహ్లీ ఏంటి ఇలా చేశాడంటోన్న అభిమానులు 

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. శుక్రవారం ఆర్‌సీబీ, సీఎస్కే మధ్య మ్యాచ్‌ జరిగింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ ఆరు వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఇక చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఈ టార్గెట్‌ను చేధించింది. దాంతో.. సీఎస్కే విజయంతో సీజన్‌ను ప్రారంభించగా.. ఆర్సీబీకి మాత్రం చెపాక్‌ స్టేడియంలో మరోసారి పరాభవం తప్పలేదు.

కాగా.. ఈ మ్యాచ్‌ సందర్భంగా విరాట్‌ కోహ్లీ వ్యవహరించిన తీరుపై పలువురు క్రీడా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌2024 సీజన్‌లోనే అరంగేట్రం చేసిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్‌ రవీంద్ర అదరగొట్టాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు.. మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. చెన్నై టీమ్‌లో ఇతనే టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అయితే.. రచిన్‌ను కర్ణ్‌ శర్మ అవుట్‌ చేశాడు. కర్ణ్‌ బౌలింగ్‌లో స్లాగ్‌ స్వీప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన రచిన్‌ డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రజత్‌ పాటిదార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఈ క్రమంలోనే రచిన్‌ను ఉద్దేశించి విరాట్ కోహ్లీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. వెళ్లిపో అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది.


ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు విరాట్‌ కోహ్లీ నుంచి ఇది ఊహించలేదని కామెంట్స్ చేస్తున్నారు. కింగ్‌ కోహ్లీ స్థాయి, ఆయన వయసుకి ఇది తగదు అన్నట్లుగా చెబుతున్నారు. కొందరు కోహ్లీ అభిమానులు కూడా దీన్ని తప్పుబడుతున్నారు. కాగా.. చెన్నైతో తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 20 బంతులను ఎదుర్కొని కేవలం 21 పరుగులు రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్-2024 సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ముస్తాఫిజుర్‌ రహ్మన్‌ నిలిచాడు. ఇతను 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

Next Story