విరాట్ కోహ్లీని ఘోరంగా అవమానించిన న్యూజిలాండ్ వెబ్‌సైట్.. ఫ్యాన్స్ ఫైర్
Virat Kohli insulted by New Zealand website.ఎన్నో అంచనాలతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్‌లో అడుగుపెట్టిన
By తోట వంశీ కుమార్ Published on 26 Jun 2021 2:05 AM GMTఎన్నో అంచనాలతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పైనల్‌లో అడుగుపెట్టిన భారత్‌కు న్యూజిలాండ్ షాకిచ్చింది. భారత్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఓటమితో విరాట్ సేన తల్లడిల్లుతోంది. ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ పై ఇంటా బయట విమర్శలు మొదలయ్యాయి. మాజీ ఆటగాళ్లు మొదలుకొని అభిమానుల వరకు భారత జట్టు ప్రదర్శనపై ముఖ్యంగా విరాట్ కెప్టెన్సీపై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్‌కు చెందిన ఓ ప్రముఖ వెబ్‌సైట్ విరాట్ కోహ్లీని ఘోరంగా అవమానించింది. కోహ్లీని అవమానకర రీతిలో చూపించింది. దీంతో సదరు వైబ్‌సైట్ పై అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు.
TheAccNZ అనే వెబ్‌సైట్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ ఓటమిపాలయ్యాక ఓ ఫోటోను తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఒక మహిళ.. బెల్ట్ తో ఓ మనిషిని పట్టుకుని ఉంటుంది. ఆ మహిళను కైల్ జేమీసన్‌తో పోలుస్తూ.. ఆ మనిషిని కోహ్లీతో పోల్చింది. ఫైనల్‌లో కోహ్లీ రెండు సార్లు జేమీసన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. దీనిని పై క్రీడాభిమానులు..ముఖ్యంగా విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ లాంటి టాప్ ప్లేయర్స్‌ని ఇలా అవమానించడం తగదని హెచ్చరిస్తున్నారు.
భారత అభిమానులు తలచుకుంటే ఆ వెబ్‌సైట్‌కు నామారూపాలు లేకుండా చేస్తారని వార్నింగ్ ఇస్తున్నారు. మరికొందరైతే ఇలాంటి చర్యల వల్ల న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు ఉన్న మంచి ఇమేజ్ మసకబారుతుందని కామెంట్ చేస్తున్నారు. ఇంకొంత మంది ఫ్యాన్స్.. జేమీసన్‌ను మహిళతో పోల్చుకుని తమను తామే దిగజార్చుకున్నారని కౌంటర్ వేస్తున్నారు.