సస్పెన్షన్ ప్రమాదంలో విరాట్ కోహ్లీ.. ఒక టెస్టు నిషేదం..!
Virat Kohli in danger of facing ban after furious exchange with on field umpire.భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సస్సెండ్ అయ్యే ప్రమాదంలో ఉన్నాడు
By తోట వంశీ కుమార్ Published on 16 Feb 2021 6:25 PM ISTచెపాక్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌ను 317 పరుగుల భారీ తేడాతో టీమ్ఇండియా మట్టికరిపించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 24 నుంచి అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్టులో తలపడనున్నాయి. భారీ విజయంతో సంతోషంలో ఉన్న భారత అభిమానులకు షాక్ తగిలే అవకాశం ఉంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సస్సెండ్ అయ్యే ప్రమాదంలో ఉన్నాడు. కోహ్లీ చేసిన తప్పిదానికి నాలుగు డీ మెరిట్ పాయింట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కోహ్లీ ఖాతాలో రెండు డీ మెరిట్ పాయింట్లు ఉన్నాయి. రెండు కలిపితే.. ఓ టెస్టు మ్యాచ్ నిషేదం పడే అవకాశం ఉంది.
అసలేం జరిగిందంటే..?
రెండో టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట చివరల్లో అంపైర్ నితిన్ మీనన్ జో రూట్‌ను నాటౌట్‌గా ప్రకటించడం వివాదానికి దారి తీసింది. అక్షర్ విసిరిన బంతి నేరుగా వికెట్ల మీదకు రావడంతో ఇంగ్లాండ్ కెప్టెన్ రూట్ దానిని ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి అతడి ప్యాడ్‌కు తాకి వెనక్కి వెళ్లింది. దీనిని పట్టుకున్న పంత్ అవుట్‌కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ నితిన్ మీనన్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీనిపై కొహ్లీ రివ్యూకు వెళ్లడంతో బంతి ప్యాడ్‌కు తాకిందని తేలింది. అయితే నేరుగా ప్యాడ్‌కు తాకడంతో థర్డ్ అంపైర్ ఎల్బీడబ్ల్యూ కోణంలోనూ చెక్ చేయడం జరిగింది. అందులో బంతి వికెట్లను తాకుతున్నట్లు తేలింది. అయితే బంతి పిచ్ పడిన చోటు అంపైర్స్ కాల్‌గా ఉండడంతో నాటౌట్‌గా ప్రకటించారు.
దీంతో అంపైర్స్ కాల్‌పై ఆగ్రహం చెందిన కోహ్లీ అంపైర్ నితిన్ మీనన్‌తో కాసేపు వాదించాడు. దీంతో కోహ్లీపై ఐసిసి లెవల్ 1 లేదా లెవల్ 2 అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. దాంతో పాటు అతడి ఖాతాలో 4 డీమెరిట్ పాయింట్లు జత అయ్యాయి. ఇప్పటికే రెండు డీమెరిట్ పాయింట్లతో ఉన్న కోహ్లీ ఈసారి డీమెరిట్ పాయింట్లు జత చేస్తే అతడిపై ఒక టెస్ట్ లేదా రెండు టెస్టుల వేటు తప్పేలా లేదు.