వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న విరాట్ కోహ్లీ
భారతదేశంలో 18 సంవత్సరాలకు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ వేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! పలువురు ప్రముఖులు కరోనా
By Medi Samrat Published on 10 May 2021 8:40 AM GMTభారతదేశంలో 18 సంవత్సరాలకు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ వేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! పలువురు ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటూ ఉన్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ ను కోహ్లీ నేడు వేయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను కోహ్లీ పోస్టు చేశారు. విరాట్ కోహ్లీ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ వేయించుకున్నాడు. టీకా వేసుకుంటున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కోహ్లీ.. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరాడు. తమ వంతు రాగానే ఆలస్యం చేయకుండా టీకా తీసుకోవాలన్నాడు. పలువురు క్రికెటర్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఓపెనర్ శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు.
విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ కరోనా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఏకంగా 2 కోట్ల రూపాయలను సాయం చేశారు. అంతేకాకుండా సాయం చేయాలనే మంచి మనసు ఉన్న వాళ్లు కూడా ముందుకు రావాలని.. అందుకు సంబంధించి ఓ వీడియోను కొద్దిరోజుల కిందట వారి వారి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తుండటంతో అనేక మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారికి సహాయపడటం కోసం ప్రారంభించిన ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని తమ ఫ్యాన్స్‌ను కోరారు. సహాయ కార్యక్రమాల కోసం నిధిని సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధి కోసం తాము రూ.2 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. కెట్టో స్వచ్ఛంద సంస్థ ద్వారా ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఎంతో కొంత సాయం చేయాలని కోరారు.