కోహ్లీ కూతురు పేరు ఏంటో తెలుసా..?

Virat Kohli daughter name is Vamika. తాజాగా విరుష్క జంట.. తమ కూతురుకి 'వామిక'గా నామకరణం చేశారు.

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 1 Feb 2021 12:08 PM IST

Virat Kohli daughter name is Vamika

భార‌త కెప్టెన్ విరాట్‌ కోహ్లీ స‌తీమ‌ణి న‌టి అనుష్క శ‌ర్మ జ‌న‌వ‌రి 11న పండంటి బిడ్డ‌కు నిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని విరాట్ కోహ్లీ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. మాకు పాప జన్మించిందనే విషయాన్ని పంచుకునేందుకు ఎంతో సంతోషిస్తున్నా. మీ ప్రేమకు, ప్రార్థనలకు, అభినందనలకు కృతజ్ఞతలు చెబుతున్నాం' అని కోహ్లీ ట్వీట్ చేశాడు. దీంతో కోహ్లీకి కంగ్రాట్స్ చెబుతూ పలువురు సెలబ్రెటీలు ట్వీట్‌లు చేశారు.


తాజాగా విరుష్క జంట.. తమ కూతురుకి 'వామిక'గా నామకరణం చేశారు. బారసాల వేడుకలోని ఫోటోతో వీరుష్క తమ కూతురి మొదటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాకుండా 'మేమిద్దరం ప్రేమ, గౌరవంతో కలిసి జీవించాం. మా కూతురు వామిక మాప్రేమను మరో స్థాయికి చేర్చింది. బాధ, ఆనందం, కన్నీళ్లు, అన్నింటినీ కొన్నిసార్లు కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభూతి చెందుతా'మని అనుష్క శ‌ర్మ ట్వీట్ చేసింది.

ప్ర‌స్తుతం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడేందుకు చెన్నెలో క్వారంటైన్‌లో ఉన్నాడు. ఫిబ్ర‌వ‌రి 5 నుంచి భార‌త్‌-ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య టెస్టు సిరీస్ ఆరంభంకానుంది.


Next Story