'ఊ అంటావా మావా..' పాటకు కోహ్లీ స్టెప్పులు.. వీడియో వైరల్
Virat Kohli Dance for Oo Antava Mawa Song from Pushpa movie.మైదానంలో ఎంత దూకుడుగా కనిపిస్తాడో.. గ్రౌండ్ వెలుపల అంత
By తోట వంశీ కుమార్ Published on 28 April 2022 4:35 PM ISTమైదానంలో ఎంత దూకుడుగా కనిపిస్తాడో.. గ్రౌండ్ వెలుపల అంత సరదాగా ఉంటాడు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా.. కోహ్లీ ఐకాన్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రంలోని 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మామ' పాటకు స్టెప్టులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆసీస్ ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ భారత సంతతికి చెందిన వినీ రామన్‌ను ఇటీవల పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో బెంగళూరుకు ఆడుతున్న మాక్స్‌వెల్ తనకు పెళ్లైన సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులకు పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలో బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ దంపతులతో పాటు ఇతర ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. దాదాపు అందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే ఈ పార్టీకి రావడం విశేషం.
ఇక ఈ పార్టీలో విరాట్ కోహ్లీ.. 'ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మామ' పాటకు డ్యాన్స్ చేశాడు. అతడితో పాటు షాబాజ్ అహ్మద్, అనుజ్ రావత్, ఫిన్ అలెన్ తదితర రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు కూడా ఈ పాటకు డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Mood 😎 @imVkohli @RCBTweets #IPL #IPL2022 #ViratKohli #CricketTwitter #RCB #PlayBold pic.twitter.com/pWwYYSFFq0
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) April 27, 2022
ఇక ఆట విషయానికి వస్తే.. ప్రస్తుత సీజన్‌లో కోహ్లీ 9 మ్యాచులు ఆడి 128 పరుగులు మాత్రమే చేశాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చినప్పటికి పెద్దగా రాణించలేకపోయాడు. ఇక కోహ్లీ ఫామ్‌లోకి రావాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్‌సీబీ జట్టు 9 మ్యాచులు ఆడగా.. 5 మ్యాచుల్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. శనివారం ఆర్‌సీబీ పటిష్టమైన గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.